/rtv/media/media_files/CgURTrx3myiJBKZumSmH.jpg)
ap rains
AP Rain Alert: ఉత్తర బంగాళాఖాతం అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు చోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విప్పత్తుల నిర్వహణ శాఖ సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 24 గంటల్లో మరింత అవకాశం ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాల వైపు కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం వరకు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది.
ఆ జిల్లాలకు అలెర్ట్
ఈరోజు మన్యం, అల్లూరి, శ్రీకాకుళం,విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్, విశాఖపట్నం,అనకాపల్లి,కాకినాడ,కోనసీమ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేందుకు ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది.
ప్రజలకు సూచనలు
ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. భారీ హోర్డింగ్‌లు, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాల క్రింద నిలబడరాదని సూచించింది. అలాగే పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు చెట్ల కింద ఉండకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించింది. భారీ వర్షాలు కారణంగా ముందస్తు జాగ్రత్తగా మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని అధికారులు సూచించారు.