/rtv/media/media_files/2025/01/29/4ph3sPUtxSIMiQkqnZX5.webp)
women Murder
చెన్నై తండ్రికుమార్తె హత్య కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. చెన్నై తిరుముల్లైవాయల్ లోని ఓ అపార్ట్‌మెంట్ లో ఉంటున్న శామ్యూల్ శంకర్ (70), అతని కుమార్తె సింథియా (37) మృతదేహాలకుగా పడి ఉన్న కేసుకు సంబంధించి పోలీసులు డాక్టర్ శామ్యూల్ ఎబినేజర్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
పోస్టు మార్టం రిపోర్టులో వారిద్దరూ మృతి చెంది ఐదు నెలలైనట్లు తెలిసింది. వారిలో శామ్యూల్ ది సహజ మరణం కాగా సింథియా తలకు గాయమై ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది.కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వేలూర్ కి చెందిన శామ్యూల్ శంకర్ కు చికిత్స అందించేందుకు అతని కుమార్తె సింథియా సోషల్ మీడియాలో పరిచయమైన స్నేహితుడు డాక్టర్ శామ్యూల్ ఎబినేజర్ వద్దకు తీసుకుని వచ్చింది.
తరచూ వేలూర్ కి వెళ్లి రావడం ఇబ్బందిగా ఉంటుందని తెలిపిన డాక్టర్ వారిద్దరిని తాను ఉంటున్న అపార్ట్‌మెంట్ కు తీసుకొచ్చాడు.గత సెప్టెంబర్ 6న చికిత్స పొందుతూ శామ్యూల్ శంకర్ ఇంట్లోనే చనిపోయాడు.తండ్రి మృతిని తట్టుకోలేని కుమార్తె సింథియా డాక్టర్ ని ప్రశ్నించింది.దీంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి వాగ్వాదం ఏర్పడింది.అప్పుడు అతను ఆమెను కిందకు నెట్టి వేయడంతో తలకు గాయమై మృతి చెందినట్లు తెలిసింది.
రసాయనం చల్లి...
దిగ్భ్రాంతి చెందిన అతను తండ్రీ కూతుళ్ల మృతదేహాలను అదే గదిలో ఉంచి తాళం వేశాడు. దుర్వాసన రాకుండా ఉండేలా ఏసీ ఆన్ లో ఉంచి కాంచీపురం వెళ్లాడు.వారానికి రెండుసార్లు అపార్ట్‌మెంట్ కి వచ్చి మృతదేహాల పై రసాయనం చల్లి వెళ్లిపోయేవాడు.
ఈ విషయం బయటికొస్తే కాంచీపురంలోని గుండె శస్త్రచికిత్స చేసుకున్న తన తల్లికి ప్రమాదం ఏర్పడుతుందని తండ్రీకూతుళ్ల మృతిని ఐదు నెలలుగా ఆయన బయటకు రానివ్వలేదు. బంధువులకు అనుమానం రాకుండా ఉండేందుకు సింథియా ఫోన్ నుంచి వాట్సాప్ కాల్, మిస్ట్ కాల్ ఇచ్చేవాడు.
జనవరి 29న రాత్రి ఏసీ పాడైపోవడంతో ఇంట్లోంచి భయంకరమైన దుర్వాసన రావడంతో అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.తాళం పగలగొట్టి చూసేసరికి శామ్యూల్ శంకర్ , సింథియాల మృతదేహాలు కుళ్లిపోయి అస్తిపంజరాలుగా కనిపించాయి. సుమారు 12 గంటలు పాటు పోలీసులు డాక్టర్ ని విచారించారు.రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలుకు తీసుకెళ్లారు.