నేడు హర్యానాకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్
AP: ఈరోజు హర్యానాకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారంతో పాటు ఎన్డీయే పక్ష నేతల సమావేశంలో వారు పాల్గొననున్నారు.
AP: ఈరోజు హర్యానాకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారంతో పాటు ఎన్డీయే పక్ష నేతల సమావేశంలో వారు పాల్గొననున్నారు.
రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు.
తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో టీటీడీ అప్రమత్తమైంది.రెండవ ఘాట్ రోడ్డులో అక్కడక్కడ మట్టిపెళ్లలు విరిగిపడ్ఢాయి. ఇక, జేసీబీల సాయంతో మట్టి పెళ్లను సిబ్బంది తొలగిస్తున్నారు.
తిరుపతిలో భారీ వర్షాల కారణంగా టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. రేపు శ్రీవారి మెట్టు నడక మార్గం మూసివేశారు. ఘాట్రోడ్డులో కొండ చరియలపై ప్రత్యేక నిఘా పెట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలుపుతున్నారు.
చిత్తూరు జిల్లా మొలకల చెరువు దగ్గర ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యాడు. దుండగులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలకు భారీ తుఫాన్ హెచ్చరిక ఉంది. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణశాఖ మంత్రి వంగలపూడి అనిత వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం తిరుమల వెళ్లే భక్తుల మీద కూడా పడింది.భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని ఈనెల 15న సిఫారసులేఖలు, 6న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాలపై ఎక్కువగా ఉంటుంది.. ఈ మేరకు ఈ రెండు జిల్లాల కలెక్టర్లు అలెర్ట్ అయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో భారీ వర్షాల కారణంగా అన్ని స్కూళ్లకు సెలవులిచ్చారు.