రాజ్యసభకు మహేశ్ బాబు బావ.. చంద్రబాబు శుభవార్త!

మహేశ్ బాబు బావా, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్నారు. చంద్రబాబు సైతం ఈ అంశంపై సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీ నుంచి రెండు సార్లు ఎంపీగా ఆయన పని చేశారు. గత ఎన్నికల్లో ఆయన పోటీకి ఆసక్తి చూపలేదు.

New Update

ఈ రాజకీయాలు మాకొద్దు అంటూ తప్పుకున్న గల్లా ఫ్యామిలీ మళ్లీ యాక్టీవ్ పాలిటిక్స్ లోకి రానుందా? పార్లమెంట్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న గల్లా జయదేవ్ రాజ్యసభలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే ఈ పరిణామం అవును అనే అనిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి మొదలు కొని విభజిత ఆంధ్రప్రదేశ్ వరకు చిత్తూరు జిల్లాకు చెందిన గల్లా ఫ్యామిలీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించింది. అయితే కాంగ్రెస్ లో యాక్టీవ్ గా ఉన్న ఈ కుటుంబం రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరింది. 2014 వరకు యాక్టీవ్ గా ఉన్న గల్లా అరుణ కుమారి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని టీడీపీ హైకమాండ్ ను కోరారు. దీంతో గల్లా జయదేవ్ ను గుంటూరు నుంచి బరిలోకి దించింది టీడీపీ.
ఇది కూడా చదవండి: రోజాకు బిగ్ షాక్.. అట్రాసిటీ కేసు?

2014, 2019 ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచి వరుస విజయాలు సాధించారు. పార్లమెంట్ లోనూ అనేక సందర్భాల్లో తన గళం వినిపించి.. అందరినీ ఆకర్షించారు. అయితే.. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమ ఫ్యామిలీకి ఇబ్బందులు ఎదురయ్యాయని జయదేవ్ ఫ్యామిలీ చెబుతోంది. తమ వ్యాపారాలకు నాటి వైసీపీ సర్కార్ అనేక ఆటంకాలు కల్పించిందని వారు ఆరోపించారు. ఇలాంటి రాజకీయాల్లో తాము ఉండమంటూ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Minister Sridhar Babu: తెలంగాణలో అత్యత్తమ MSME విధానం తీసుకొచ్చాం

స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పకున్న జయదేవ్..

ఈ నేపథ్యంలో గత పార్లమెంట్ ఎన్నికల పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్లు టీడీపీ హైకమాండ్ కు తెలిపారు. దీంతో గుంటూరు నుంచి ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ ను బరిలోకి దించారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన చంద్రశేఖర్ కేంద్ర మంత్రి కూడా అయ్యారు. అయితే.. అనవసరంగా పాలిటిక్స్ కు దూరం అయ్యమని గల్లా ఫ్యామిలీలో వ్యక్తం అవుతోందన్న వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ద్వారా మళ్లీ యాక్టీవ్ కావాలన్నది వీరి ఆలోచనగా తెలుస్తోంది.

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు