TTD key Decision : టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం!

టీటీడీ బోర్డు  సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం విధించింది. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది.

New Update
TTD 2

TTD: టీటీడీ బోర్డు  సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం విధించింది. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది.  నిత్యం గోవింద నామాలతో మారుమోగే పవిత్రమైన తిరుమల దివ్య క్షేత్రంలో, గత కొంతకాలంగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన రాజకీయ నాయకులలో కొంతమంది.. దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయడం పరిపాటిగా మారింది.

ఇది కూడా చదవండి: రాజకీయాలు బ్రేక్.. కేటీఆర్ సంచలన నిర్ణయం!

చట్టపరమైన చర్యలు...

దీంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ బోర్డు ఇటీవల తీర్మానించింది. తిరుమలకు విచ్చేసి రాజకీయ విమర్శలు చేసే వ్యక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతీసే ప్రసంగాలకు దూరంగా ఉండి టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు!

ఇది కూడా చదవండి: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఈరోజు 3 లక్షల మందికి రుణమాఫీ !

ఇది కూడా చదవండి: ప్లీజ్ నాన్న మమ్మల్ని చంపొద్దు.. కాళ్లు పట్టుకున్నా కనికరించని తండ్రి

Advertisment
Advertisment
తాజా కథనాలు