/rtv/media/media_files/2025/04/21/ZgiKcUFyLBew63qIjXsA.jpg)
AP Deputy CM Pawan Kalyan
చిరుత మృతి ఘటనలో తమ వారిపై అన్యాయంగా కేసులు పెట్టారని మదనపల్లి రూరల్ మండలం పొన్నూటిపాలెంకు చెందిన రైతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ కేసుల నుంచి తమ వారికి విముక్తి కల్పించాలని కోరుతూ శాసన మండలిలో ప్రభుత్వ విప్, జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ను కలిశారు. పవన్ కల్యాణ్ దృష్టికి తమ ఆవేదనను తీసుకెళ్లాలని కోరారు. కేవలం చిరుత చనిపోయిన ప్రాంతానికి ఆనుకుని ఉన్న భూమిని ప్రామాణికంగా చేసుకుని అటవీశాఖ అధికారులు తమ వారిని అరెస్టు చేసినట్లు వాపోయారు.
Also Read : దుబాయ్ నుంచి బ్యాగ్ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?
చిరుత మృతి కేసు నుంచి విముక్తి కల్పించండి
— JanaSena Party (@JanaSenaParty) April 21, 2025
• శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారిని కలిసిన పొన్నూటిపాలెం రైతుల కుటుంబాలు
చిరుత మృతి ఘటనలో తమ వారిపై అన్యాయంగా కేసులు పెట్టారని, కేసుల నుంచి తమ వారికి విముక్తి కల్పించాలని కోరుతూ మదనపల్లి రూరల్ మండలం… pic.twitter.com/NvsMqkTPu2
Also Read : మరోసారి రెచ్చిపోయిన ఖలిస్థానీ వేర్పాటువాదులు.. కెనడాలో హిందూ ఆలయంపై దాడి
విచారణ లేకుండా అరెస్ట్ చేశారు..
చిరుత మృతిలో తమవారి ప్రమేయం లేదన్నారు. ఏ మాత్రం విచారణ జరపకుండా, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అప్పటికప్పుడు అరెస్టులు చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తమ వారికి న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని ఈ సందర్భంగా రైతులు కుటుంబాలకు ఎమ్మెల్సీ హరిప్రసాద్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మదనపల్లె నియోజక వర్గ జనసేన ఇంఛార్జి జి. రాందాస్ చౌదరి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ పాల్గొన్నారు.
Also Read : హైదరాబాద్‌లో స్పైడర్‌మ్యాన్.. కళ్లు చెదిరే విన్యాసాలు- డొంట్ మిస్ (VIDEO)
Also Read : తాళ్ల సహాయంతో బావుల్లోకి.. నీటి కరువుతో పోరాడుతున్న గ్రామం.. వీడియో వైరల్
Pawan Kalyan | janasena-party | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | andhra-pradesh-politics | andhra-pradesh-news