/rtv/media/media_files/2025/04/21/PLO2Q1gQKGRYO4kahoQI.jpg)
Hindu temple vandalised with pro-Khalistan graffiti in Canada
కెనడాలో సిక్కు వేర్పాటువాదులు మళ్లీ రెచ్చిపోయారు. ఖలిస్థానీ జెండాలతో శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయం వద్ద హల్‌చల్ చేశారు. ఏప్రిల్ 19న ఘటన జరిగింది. వాళ్లు చేసిన దాడిలో దేవాలయ ప్రవేశద్వారం, స్తంభాలు ధ్వంసమైపోయాయి. శనివారం ఉదయం 3 గంటలకు ఇద్దరు దుండగులు ఖలిస్థానీ నినాదాలు చేస్తూ వచ్చారు. ఆలయంలోకి వచ్చి అక్కడున్న స్తంభాలు, ద్వారాలపై ఖలిస్థానీ అనుకూల రాతలు రాశారు.
Also Read: తాళ్ల సహాయంతో బావుల్లోకి.. నీటి కరువుతో పోరాడుతున్న గ్రామం.. వీడియో వైరల్
ఈ విషయాన్ని అక్కడి ఆలయ అధికారులు వెల్లడించారు. అంతేకాదు ఆలయంలో విధ్వంసం సృష్టించాక వీటి ఆధారాలు దొరకకుండా ఉండేందుకు సీసీటీవీ కెమెరాలను దొంగిలించారని తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఉండే ఇలాంటి ద్వేషపూరితమైన విధ్వంసాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also read: మాయ లేడీ.. అండర్‌వేర్స్ ఎలా చోరీ చేసిందో చూశారా? - ‘కి’లేడీ మామూల్ది కాదు భయ్యా!
చివరికి ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల వెనుక భారత వ్యతిరేక శక్తుల హస్తం ఏదైనా ఉందా ? లేదా ఇంకా ఎవరైనా ఉన్నారా ? అని తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. మళ్లీ దాడులు జరగకుండా ఆలయం వద్ద భద్రత దళాలు మోహరించాయని చెప్పారు. తాజాగా దాడులకు పాల్పడ్డవారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా భారత్‌లో ప్రత్యేక సిక్కుల రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు ఖలిస్థానీ వేర్పాటు వాదులు గత కొన్నేళ్లుగా కెనడాలో నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: దేశంలో ఐఐటీ విలేజ్.. 40 మందికి పైగా విద్యార్థులు జేఈఈ మెయిన్స్ క్వాలిఫై
latest-news | khalistan | canada | hindu-temple | international
Follow Us