/rtv/media/media_files/2025/04/21/tIpJOVf1rqA4f3C7R9cy.jpg)
crime news
‘మందు బాబులం మేము మందుబాబులం.. మందేస్తే మాకు మేమే మహారాజులం’.. ఈ సాంగ్ నిజంగా మందు బాబులకే అంకితం చేయాలి. ఎందుకంటే మందేసిన తర్వాత వారు కింగ్స్ లాగే ప్రవర్తిస్తారు. హీరోల్లా రెచ్చిపోతుంటారు. ఆ సమయంలో ఎవరికీ లేనంత కండ బలం, గుండెబలం మందుబాబులకు ఉంటుంది. ఆ టైంలో మందుబాబులు చేసిన విన్యాశాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.
Also Read : ఆగని యుద్ధం.. 30 వేల మంది యువతను నియమించుకున్న హమాస్ !
మత్తెక్కే మందుబాబులు రోడ్లపై, వీధుల్లో, వాహనాల్లో ఎలాంటి రచ్చ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవలే ఏపీకి చెందిన ఓ వ్యక్తి ఫుల్‌గా మందుతాగి ఏకంగా కరెంట్ స్థంబం వైర్లపై పడుకున్నాడు. ఎంతమంది కిందికి దిగమని చెప్పినా వినిపించుకోలేదు. అందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా అలాంటి ఘటనే మరొకటి తెలంగాణలో చోటుచేసుకుంది.
Also Read : కేవలం రూ.300 వందలకే ఇంటింటికీ ఇంటర్నెట్.. రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!
స్పైడర్‌మ్యాన్‌లా విన్యాశాలు
పీకల్‌దాకా తాగిన ఓ వ్యక్తి చేసిన విన్యాశాలు అన్నీ ఇన్నీ కాదు. కనీసం కేవీ దీవి లేకుండా ప్రవర్తించాడు. ఆ సమయంలో అతడి కాన్ఫిడెన్స్ లెవెల్ 100 శాతం దాటిపోయిందనే చెప్పాలి. కానీ అతడు చేసిన విన్యాశం వల్ల తృటిలో ప్రాణాపాయ స్థితినుంచి బయటపడ్డాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
Also Read: మావోయిస్టు అగ్రనేత హతం.. వివేక్‌ను మట్టుబెట్టిన భధ్రతాబలగాలు!
#viralvideo
— greatandhra (@greatandhranews) April 21, 2025
హైదరాబాద్ అత్తాపూర్ పిల్లర్ నంబర్ 100 వద్ద మద్యం తాగి బ్రిడ్జిపై నుండి పడి తీగకు వేలాడుతూ కనిపించిన మందు బాబు.
స్థానికులు కింద కార్ బాడీ కవర్ గెట్టిగా పట్టుకుంటే దాని మీదకు దూకి సురక్షితంగా ప్రాణాలు కాపాడుకున్న మందు బాబు. pic.twitter.com/PBMTmVBqMG
హైదరాబాద్ అత్తాపూర్‌లో ఓ మందుబాబు విన్యాశాలతో చెలరేగిపోయాడు. పిల్లర్ నంబర్ 100 వద్ద మద్యం తాగి బ్రిడ్జిపై నుండి పడి తీగకు వేలాడుతూ కనిపించాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అందులో అతడు వైర్లకు వేలాడుతూ కనిపించాడు.
Also Read: కర్ణాటక డీజీపీ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. తండ్రి హత్యకు సహకరించిన కూతురు?
సినిమాల్లో చూసిన స్పైడర్‌మ్యాన్ వలే వైర్లపై పాక్కుంటూ వెళ్తున్నట్లు కనిపించింది. అదే సమయంలో స్థానికులు కింద కార్ బాడీ కవర్ గట్టిగా పట్టుకున్నారు. దీంతో ఆ మందుబాబు దాని మీదకు దూకి సురక్షితంగా ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇప్పుడది వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
viral-video | viral-news | latest-telugu-news | telugu-news