/rtv/media/media_files/2025/04/21/AsLjIIeCygZHBdw1HDzo.jpg)
Maharashtra Borichivari women face hardship for drinking water
Maharashtra Borichivari Village: దేశం ఇంత అభివృద్ధి చెందుతున్న సమయంలో కూడా.. తాగునీటి కోసం అలమటించే గ్రామాలు ఇంకా ఉన్నాయి. బిందెడు నీటి కోసం మహిళలు మహిళలు బారులుగా ఖ్యూలో నిలుచోవడం, కిలోమీటర్లు నడిచే దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా బొరిచివాడి గ్రామంలో ఇలాంటి పరిస్థితే తలపిస్తోంది. వేసవి రావడంతో ఆ ప్రాంతం తీవ్రమైన నీటి కొరతతో పోరాడుతోంది. భూగర్భంలో నీటి మట్టాలు ప్రమాదకరంగా పడిపోయాయి.
Also Read : ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావేంట్రా.. ‘సీఎం రేవంతన్న కుదిర్చిన ముహూర్తానికే నా పెళ్లి.. లేదంటే’!
తాళ్ల సహాయంతో బావుల్లోకి
మౌలిక సదుపాయమైన తాగునీటి కోసం ఆ ప్రాంత ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. భూమిలో నీటిశాతం తగ్గిపోయావడంతో బావుల్లోని నీరు ఎండిపోయాయి. ఈ పరిస్థితి గ్రామంలోని మహిళలు నీటి కోసం ప్రాణాంతక మార్గాలను ఎంచుకోవడానికి దారితీస్తోంది. దిగువ భాగంలో కొంత నీరు ఉండడంతో.. వాటి కోసం మహిళలు తాళ్ల సహాయంతో బావుల్లోకి దిగుతున్నారు. బిందెడు నీటి కోసం ప్రాణాలను ప్రమాదంలో పాడేసుకుంటున్నారు. పలు అడుగుల లోతు నుంచి నీటి బిందెను ఎత్తుకొని పైకి ఎక్కడం సాధారణమైన విషయం కాదు. తాడు జారి పడిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#WATCH | Maharashtra | Women face hardships in their quest to get water for daily use amid water crisis in Borichivari village of Taluka Peth in Nashik district pic.twitter.com/2TTSBTaVMd
— ANI (@ANI) April 20, 2025
Also Read: Khushboo Patani: చిన్నారిని కాపాడిన దిశా పటాని అక్క .. ఈ విషయం తెలుసుకుంటే సెల్యూట్ చేస్తారు
ఈ పరిస్థితిపై స్థానికులు ఏమంటున్నారంటే ... బొరిచివాడి గ్రామంలో ఇలా జరగటం తొలిసారి కాదు. కానీ ఈ ఏడాది వేసవి ప్రారంభ దశలోనే ఇంత తీవ్రమైన పరిస్థితి ఎదురవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. "ఇంకా అసలైన వేసవి మొదలైతే మేము ఎలా బతకగలమో తెలియడం లేదు అని వాపోతున్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతులు చేసినప్పటికీ, ఆశించిన స్పందన రాలేదని గ్రామస్తులు చెబుతున్నారు.
telugu-news | maharastra | latest-news
Also Read: Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు ఇదే.. నైట్‌పబ్ బౌన్సర్ నుంచి పోప్‌గా!!