/rtv/media/media_files/2025/09/19/ycp-mlcs-joined-in-tdp-2025-09-19-20-14-59.jpg)
YCP Mlcs joined in TDP
ఏపీ రాజకీయాల్లో(andhra-pradesh-politics) కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు(ycp-mlcs) మర్రి రాజశేఖర్ రెడ్డి, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు టీడీపీ(tdp) లో చేరారు. సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ ముగ్గురు నేతలు తెలుగు దేశం పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఇప్పటికే వీళ్లు వైసీపీ సభ్యత్వానికి, తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా లేఖలు అందించారు. కానీ ఏపీ శాసన మండలి చైర్మన్ ఈ రాజీనామాలను ఆమెదించలేదు.
Also Read : తప్పుచేశావ్ పవనన్న.. వినుత కోట సంచలన లేఖ!
YCP MLA's Jump To TDP
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన అనంతరం పార్టీ నుంచి ఒక్కొక్కరూ రాజీనామా చేస్తూ వస్తున్నారు. ఇంతకుముందు ఇద్దరు ఎమ్మెల్సీలు జయమంగళ వెంకటరమణ, పోతుల సునీతలు కూడా వైసీపీకీ గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు మళ్లీ ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే వైసీపీకి అసెంబ్లీలో బలం లేదు. దీంతో ఎమ్మెల్సీల వరుస రాజీనామాలతో శాసన మండలిలో కూడా ఆ పార్టీకి బలం తగ్గనుంది.
Also Read : ఎమ్మెల్యే పదవికి రాజీనామా.. జగన్ సంచలన ప్రకటన!
కర్రి పద్మశ్రీ
పద్మశ్రీ 2022లో గవర్నల్ నామినేషన్ కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మహిళా నాయకురాలిగా తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తాజగా ఆమె టీడీపీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: తెలంగాణకు 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన
బల్లి కల్యాణ చక్రవర్తి
తిరుపతి జిల్లాకు చెందిన కల్యాణ చక్రవర్తి 2021లో ఎమ్మెల్యేలో కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన తండ్రి దుర్గారావు గతంలో తెలుగు దేశం పార్టీలోనే ఉన్నారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన కళ్యాణ చక్రవర్తి కూడా తాజాగా టీడీపీలోకి చేరారు.
మర్రి రాజశేఖర్ రెడ్డి
పల్నాడు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్ రెడ్డి 2021 ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా గెలిచారు. ఈ ఏడాది మార్చిలో వైసీపీకి , మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. కానీ ఆయన రాజీనామా ఆమోదం కాలేదు. ఈ క్రమంలోనే తాజాగా టీపీడీలో చేరారు.
Also Read: మైనార్టీలకు రేవంత్ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 1.50 లక్షలు