BIG BREAKING: ఎమ్మెల్యే పదవికి రాజీనామా.. జగన్ సంచలన ప్రకటన!

ఏపీలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎప్పట్లాగే విపక్ష వైసీపీ చీఫ్‌ జగన్‌ సహా ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లలేదు. అయితే అసెంబ్లీకి వెళ్లకపోవడంపై తాజాగా జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
Jagan

Jagan

ఏపీలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎప్పట్లాగే విపక్ష వైసీపీ చీఫ్‌ జగన్‌ సహా ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లలేదు. అయితే అసెంబ్లీకి వెళ్లకపోవడంపై తాజాగా జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. '' అసెంబ్లీకి వెళ్లొద్దని నేను ఎవరికీ చెప్పలేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సమయం ఇస్తామని క్లారిటీ ఇవ్వొచ్చు. అసెంబ్లీకి వెళ్లలేదని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తాం. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తామని'' జగన్ అన్నారు.   

Also Read: పవన్‌ vs బోండా ఉమ.. ఏపీ అసెంబ్లీలో రచ్చ రచ్చ

అంతకుముందు కూడా జగన్ పార్టీ శాసనసభాపక్ష భేటీలో అసెంబ్లీకి వెళ్లకపోవడంపై మాట్లాడారు. అసెంబ్లీకి రావాలంటే ఒక కండిషన్ ఉందని చెప్పారు. సభలో మాట్లాడేందుకు తగినంత టైమ్ ఇస్తే రేపే సభకొస్తానని తెలిపారు. ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లు కొన్ని నిమిషాలు మాత్రమే సమయం ఇస్తే నేనేం మాట్లాడాలంటూ ప్రశ్నించారు. ప్రజా సమస్యలు వివరంగా చెప్పాలంటే సమయం ఇవ్వాలని అన్నారు. సభకు రండి సమయం ఇస్తామని స్పీకర్ అంటున్నారు కదా.. ఎమ్మెల్యేలు వెళ్లి స్పీకర్‌ను కలిగి అడగండని సూచించారు. 

Advertisment
తాజా కథనాలు