South Central Railway: సంక్రాంతి తిరుగు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త..8 ప్రత్యేక రైళ్లు!

సంక్రాంతి కి సొంతూర్లకు వెళ్లి తిరిగి పయనమైన వారికి సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఓ తీపి కబురు చెప్పింది. తిరుగు ప్రయాణికుల కోసం 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. జనవరి 18 నుంచి 20 తేదీలలో ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.

New Update
Special Trains

Special Trains

South Central Railway: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ముగిశాయి. దీంతో ఇప్పటికే పండగకు సొంతూళ్లకు వెళ్లిన కొందరు తిరిగి వారి గమ్య స్థానాలకు చేరుకోవడానికి రెడీ అవుతున్నారు. దీంతో రైలు ప్రయాణం చేసేవారికి దక్షిణ మధ్య రైల్వే ఓ తీపి కబురు చెప్పింది.

Also Read: Horoscope Today: నేడు ఈ రాశివారు కొత్త నగలు కొనుగోలు చేస్తారు..మీ రాశేనేమో చెక్‌ చేసుకోండి మరి!

పండగకు సొంతూర్లకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు నడిపిన సౌత్‌ సెంట్రల్‌ రైల్వే తిరుగు ప్రయాణం చేసేవారి కోసం కూడా 8 ప్రత్యేక రైళ్లును నడపుతున్నట్లు వెల్లడించింది.

Also Read: Arvind Kejriwal: బీజీపీ మేనిఫెస్టోపై స్పందించిన కేజ్రీవాల్.. మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్

ప్రయాణ ఖర్చులు...

జనవరి 18 నుంచి 20 తేదీలలో ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. దాంతో సామాన్యుడికి ప్రయాణ ఖర్చులు తగ్గనున్నాయి. జనవరి 18న కాకినాడ నుంచి చర్లపల్లికి ఒక రైలు, విశాఖపట్నం నుంచి 2 ప్రత్యేక రైళ్లు చర్లపల్లికి మొదలవుతాయని అధికారులు చెప్పారు. అదే విధంగా జనవరి 19న విశాఖపట్నం, నరసాపురం నుంచి మరో 2 రైళ్లు చర్లపల్లి బయలుదేరతాయి. 

అదేరోజు చర్లపల్లి నుంచి భువనేశ్వర్‌కు ఒకటి, విశాఖపట్నానికి ఒకటి చొప్పున 2 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు సౌత్‌ సెంట్రల్‌  రైల్వే తెలిపింది. చర్లపల్లి నుంచి విశాఖపట్నానికి జనవరి 20వ తేదీన మరో ప్రత్యేక రైలు ఉందని సీపీఆర్వో సీహెచ్‌ శ్రీధర్‌ తెలిపారు.

Also Read: Australian Open- Basavareddy: జకోవిచ్‌ను వణికించిన 19 ఏళ్ల తెలుగు కుర్రాడు.. ఎవరు ఈ బసవరెడ్డి!?

Also Read: Saniya Mirza: తల్లిదండ్రులు ఎప్పటికీ ఆ విషయాన్ని మర్చిపోవద్దు..సానియా మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు