Saniya Mirza: టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా స్పోర్ట్స్‌తో పాటు ఇతర విషయాల మీద కూడా తన అభిప్రాయాలను చాలా కచ్చితంగా చెబుతారనే విషయం తెలిసిందే.అది ఆటైనా, సామాజిక అంశాలు అయినా సరే. తాజాగా ఆమె పిల్లల గురించి మాట్లాడుతూ.. తల్లిదండ్రులకు పలు కీలక సూచనలు చేసింది. చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన సీసా సంస్థ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్న సందర్భంలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. Also Read: Oyo Rooms : ట్రెండింగ్లో ఓయో రూమ్స్.. దివాలా తీయడం ఖాయమట! ఒక అథ్లెట్‌గా, తల్లిగా పిల్లలకు ఏం కావాలి? వాళ్ల భవిష్యత్‌ను ఎలా తీర్చిదిద్దాలి? వాళ్ల కోసం ఎలాంటి వాతావరణాన్ని సృష్టించాలి? అనేది అర్థం చేసుకున్నా. సీసాలో పిల్లల కోసం ఆటపాటలతో పాటు ఫిట్‌నెస్, క్రియేటివిటీ లాంటివి ఇక్కడ భాగం చేయడం చాలా నచ్చిందని తెలిపింది.పిల్లలతో పాటు పేరెంట్స్‌కు కూడా తాను సమాన గౌరవం ఇస్తానని సానియా మీర్జా పేర్కొంది. Also Read: Cheapest 5G Smartphones: పొంగల్ ఆఫర్స్ పిచ్చెక్కించాయ్.. రూ.10 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే! విశ్వాసం, క్రమశిక్షణ... సీసా లాంటి చోట్లకు రావడం వల్ల పిల్లలు-తల్లిదండ్రుల మధ్య బంధాన్ని మరింత బలంగా చేస్తుందని సానియా చెప్పుకొచ్చింది. పిల్లలకు ఆటపాటలతో పాటు ఫిట్‌నెస్ మీద కూడా దృష్టి పెట్టేలా తల్లిదండ్రులు మరింత శ్రద్ద తీసుకోవాలని సానియా చెప్పుకొచ్చింది. ఫిట్‌గా ఉంటే చిన్నారుల్లో విశ్వాసం, క్రమశిక్షణ పెరుగుతుందని వివరించింది. ఆ క్షణాన్ని ఎలా ఆస్వాదించడం, ఆ మూమెంట్‌లో బతకడం అనేవి నేర్చుకుంటారని సానియా తెలిపింది. పిల్లలకు చదువుతో పాటు ఫిట్‌నెస్‌ను పెంపొందించుకోవడానికి కూడా పేరెంట్స్ సహాయపడాలని.. తమ శరీర దారుఢ్యాన్ని పెంచుకోవడం మీద కూడా ఫోకస్ చేయాలని సూచించింది. ఈ కార్యక్రమంలో సీసా ఫౌండర్ స్వాతి గునుపతి, మెగా డాటర్, ఈ సంస్థ కో-ఫౌండర్ శ్రీజ కొణిదెల కూడా పాల్గొన్నారు. Also Read: TTD: తిరుమల వెళ్లే వారికి అలర్ట్.. రేపు బ్రేక్ దర్శనాలు రద్దు Also Read: భారత్‌లో బంగ్లాదేశ్ జడ్జిల ట్రైనింగ్ క్యాన్సిల్..యూనస్ సర్కార్ నిర్ణయం