Arvind Kejriwal: బీజీపీ మేనిఫెస్టోపై స్పందించిన కేజ్రీవాల్.. మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్

బీజేపీ మేనిఫెస్టోపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీ ప్రకటించిన హామీలు ఆప్ నుంచి కాపీ చేశారంటూ విమర్శలు చేశారు. ఉచితాలు ఇస్తున్నందకు తనపై విమర్శలు చేయడం తప్పని ప్రధాని మోదీ అంగీకరించాలంటూ డిమాండ్ చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Kejriwal and Modi

Kejriwal and Modi

ఢిల్లీ ఎన్నికల వేళ బీజేపీ శుక్రవారం మేనిఫెస్టో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీ ప్రకటించిన హామీలు ఆప్ నుంచి కాపీ చేశారంటూ విమర్శలు చేశారు. ఉచితాలు ఇస్తున్నందకు తనపై విమర్శలు చేయడం తప్పని ప్రధాని మోదీ అంగీకరించాలంటూ డిమాండ్ చేశారు.   

'' బీజేపీ ప్రతీసారి కేజ్రీవాల్ ఉచితాలు ఇస్తున్నారని ఆరోపిస్తోంది. ఇప్పుడు ఢిల్లీ ప్రజలకు ఉచితాలిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నేడ్డా ప్రకటనచేశారు. ప్రధాని మోదీ తమపై చేసిన విమర్శలు తప్పని అంగీకరించాలి. మేము అమలు చేస్తున్న స్కీమ్‌లనే బీజేపీ తమ మేనిఫెస్టోలో పెట్టింది. మరీ ప్రజలు వాళ్లకెందుకు ఓటు వేయాలి ?. ఢిల్లీలో శాంతిభద్రతలకు సంబంధించి ఎలాంటి హామీలు ఇవ్వలేదు. వాళ్లు విడుదల చేసిన మేనిఫెస్టో అబద్ధాల పుట్ట అని'' కేజ్రీవాల్‌ ఆరోపించారు.   

Also Read: సైఫ్‌పై దాడి వెనుక అండర్‌వరల్డ్‌ హస్తం ? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

తాము అమలు చేస్తున్న పథకాలనే కాషాయ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిందని కేజ్రీవాల్‌ ఆరోపించారు. అలాంటప్పుడు వారికెందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. దేశ రాజధానిలో శాంతిభద్రతలకు సంబంధించి ఎటువంటి హామీలు భాజపా ఇవ్వలేదన్న విమర్శించారు. ఆ మేనిఫెస్టోను అబద్ధాల పుట్టగా పేర్కొన్నారు. మొహల్లా క్లినిక్‌లను మూసివేస్తామని భాజపా చెబుతోందని మాజీ సీఎం ఆరోపించారు.

ఇదిలాఉండగా 'సంకల్ప పత్రా' పార్ట్-1 పేరుతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) శుక్రవారం మేనిఫెస్టోను ప్రకటించారు. గర్భిణీలకు రూ.21 వేల ఆర్థిక సాయం, పేదలకు రూ.500 లకే ఎల్పీజీ సిలిండర్లు, మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. అలాగే 60 నుంచి 70 ఏళ్ల వయోవృద్ధులకు రూ.2500 పెన్షన్, 70 ఏళ్ల పైబడిన వాళ్లకి రూ.3000 పెన్షన్ ఇవ్వడంతో పాటు జేజే క్లస్టర్లలో అటల్ క్యాంటీన్‌లు ఏర్పాటు చేసి రూ.5కే భోజనం పెట్టడతామని హామీ ఇచ్చారు.  అంతేకాదు వీటితో సహా ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలు కూడా అలాగే కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.  

Also Read: ఏపీకి గుడ్‌న్యూస్.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 ప్యాకెజీ

Advertisment
తాజా కథనాలు