/rtv/media/media_files/2025/01/13/fCsdmjCLEdbTWEcBGn4Q.jpg)
Australian Open Basavareddy takes the first set against Djokovic
Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 నోవాక్ జకోవిచ్- నిషేష్ బసవారెడ్డి మధ్య తొలి రౌండ్ రసవత్తరంగా సాగింది. తెలుగు మూలాలున్న 19 ఏళ్ల కుర్రాడు నిషేష్ 29-27 తేడాతో జకోవిచ్‌పై పైచేయి సాధించాడు. వైల్డ్‌కార్డ్ ద్వారా బరిలోకి దిగి అదరగొట్టిన నెల్లూరు కుర్రాడిపై ప్రశంసలు కురిపిస్తున్నాయి.
Nishesh Basavareddy is Holding His Own Against Novak Djokovic👏👏👏#tennis #AO25 pic.twitter.com/G6rRofph9N
— FirstSportz Tennis (@FS_Tennis1) January 13, 2025
మెల్‌బోర్న్ పార్క్‌లో
ఈ మేరకు మెల్‌బోర్న్‌లోని విక్టోరియా పార్క్‌లో సోమవారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్‌లో నొవాక్ జొకోవిచ్ తో నిషేష్ బసవారెడ్డి తలపడ్డాడు. ర్యాంకింగ్స్‌లో 133వ స్థానంలో ఉన్న ఈ కుర్రాడు ప్రపంచ మేటీ ఆటగాడినే వణికించడం గమనార్హం. కాగా 29-27 తేడాతో తొలి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. వైల్డ్‌కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన నెల్లూరు బాయ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. బసవారెడ్డి గురించి నెటిజన్లు తెగ వెతుకుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు చెందిన నిషేష్ బసవారడ్డి తల్లిదండ్రులు 1999నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో స్థిరపడ్డారు. బసవరెడ్డి కాలిఫోర్నియాలోని న్యూపోర్ట్ బీచ్‌లో జన్మించారు. 8 ఏళ్ల వయసులోనే టెన్నీస్ కోచ్ బ్రయాన్ స్మిత్ నేతృత్వంలోని టెన్నిస్ శిబిరంలో చేరి జూనియర్ స్థాయిలోనే అతను ర్యాంకింగ్ 3కి చేరుకున్నాడు. 2022లో ఓజాన్ బారిస్‌తో కలిసి జూనియర్ యూఎస్ ఓపెన్‌లో బాలుర డబుల్స్ టైటిల్స్‌ను కైవసం సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఆక్లాండ్ ఓపెన్ 2016లో 18 ఏళ్ల రీల్లీ ఒపెల్కా తర్వాత టూర్-లెవల్ హార్డ్‌కోర్ట్ సెమీఫైనల్‌కు చేరుకున్న అతి పిన్న వయస్కుడైన అమెరికన్ గా బసవారెడ్డి ఘనత సాధించాడు.
Also Read : తెలుగింటి బాపు బొమ్మలా.. లంగా వోణీలో శ్రీముఖి ఎంత అందంగా ఉందో చూడండి!
ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అయిన నిషేష్ గత ఏడాదే ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడిగా మారాడు. డబుల్స్‌లో భారత మూలాలున్న ఆటగాడు రాజీవ్‌రామ్ తనకు మార్గదర్శనం చేశాడన్నాడని చెప్పాడు. 'చాలెంజర్స్ పోస్ట్-యుఎస్ ఓపెన్‌లో స్థిరమైన ఫలితాలు సాధించడం ఒక నమ్మకాన్ని కలిగించిందని నేను భావిస్తున్నా. దీనిని నేను ప్రతి టోర్నమెంట్‌లో పునరావృతం చేయగలను. బహుశా నా ఆటలో చాలా అభివృద్ధి చెందాను. నా ఆట అనేక అంశాలలో ఏడాది పొడవునా స్థిరమైన మెరుగుదల కనిపించింది. జకోవిచ్ తో ఆడటం నిజంగా నాకల. అతనే నా ఆరాధ్య ఆటగాడు' అని బసవారెడ్డి చెప్పాడు.
Also Read : గ్యాస్ స్టేషన్ లో పేలుడు..15 మంది మృతి!