Horoscope Today: నేడు ఈ రాశివారు కొత్త నగలు కొనుగోలు చేస్తారు..మీ రాశేనేమో చెక్‌ చేసుకోండి మరి!

కర్కాటక రాశి వారికి నేడు శుభకార్యప్రయత్నాలు నేరవేరతాయి.మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు.కుంభ రాశి వారు బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉంటే మంచిది.

New Update
horoscope 2025 today

horoscope 2025 today

మేష రాశి వారు ఈరోజు తలపెట్టిన శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. ధనచింత ఉండదు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు.

వృషభ రాశి వారు ఈరోజు  నూతనకార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతనకార్యాలు మొదలు పెడతారు. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. మీరు చేసే ప్రతిపనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త పడాలి.

Also Read: Ap Govt: ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌  విచారణకు ఆదేశాలు!

మిథున రాశి వారికి నేడు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ప్రయత్నకార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకు వెళ్తారు.

కర్కాటక రాశి వారు నేడు శుభకార్యప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు.

శ్రమ‌కు త‌గిన ఫ‌లితం...

సింహ రాశి వారు నేడు బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వ‌ల్ల లాభం చేకూరుతుంది. స‌మాజంలో గౌర‌వ‌మ‌ర్యాదలు అందుకుంటారు.  అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు. శ్రమ‌కు త‌గిన ఫ‌లితం ల‌భిస్తుంది. ధనచింత ఉండదు. శుభకార్య ప్రయ‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి.

Also Read: Karnataka: మెట్రో ప్రయాణికులకు బిగ్‌ షాక్‌..భారీగా ఛార్జీలు పెంపు!

కన్య రాశి వారు ఈరోజు మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తవహించడం అవసరం. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. ఇతరులకు హానితలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు.

తుల రాశి వారికి ఈరోజు ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధల వల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. తొందరపాటు వల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి.

వృశ్చిక రాశి వారు ఈరోజు  నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది.

ధనుస్సు రాశి వారు ఈరోజు పిల్లలవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడుతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయమవుతారు.

మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణబాధలు తొలగిపోతాయి. శత్రుబాధలు ఉండవు. వ్యవసాయరంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది.

కుంభ రాశి వారికి  ఈరోజు బంధు, మిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.

మీన రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది.

Also Read: Cinema: సంక్రాంతికి వస్తున్నాం టీమ్‌తో చిన్నోడు సందడి

Also Read: Fire Accident: : తిరుపతి-తిరువూరు బస్సు అగ్నికి ఆహుతి..20 మంది ప్రయాణికులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు