Bengaluru: బెంగళూరులో లైంగిక వేధింపులు కామన్..హోంమంత్రి పరమేశ్వర వివాదాస్పద కామెంట్స్!

బెంగళూరు పెద్ద సిటీ. ఇక్కడ మహిళలపై వేధింపులు కామన్. ఈ మాట అన్నది ఎవరో కాదు. సాక్షాత్తు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర. ఈ చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి.  తాజాగా జరిగిన ఓ సంఘటనపై ఆయన ఈ విధంగా స్పందించారు.

New Update
ks

KS Home Minister Parameswara

కర్ణాటక హోంమంత్రి పరమేశ్వరపై అక్కడి మహిళలు మండిపడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు. బెంగళూరులోని బీటీఎం లే అవుట్ లో ఒక వ్యక్తి ఇద్దరు యువతులను ఫాలో అయి...అందులో ఒకామెతో అసభ్యంగా ప్రవర్తించి పారిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపైనే హోంమంత్రి పరమేశ్వర స్పందించారు. పైగా బెంగళూరు పెద్ద సిటీ.. అక్కడ మహిళలపై లైంగిక వేధింపులు కామన్ అంటూ కొట్టిపడేశారు. ఇంకే ముందీ..ఈ వ్యాఖ్యలు కాస్తా పెద్ద దుమారాన్ని రేపాయి. హోంమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడ్డం సరి కాదంటూ మహిళలు దుమ్మెత్తి పోస్తున్నారు. 

అబ్బే అదేమీ పెద్ద విషయం కాదు..

అయితే బెంగళూరులో వేధింపులకు గురైన అమ్మాయిలు తమకు జరిగిన దానిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అమ్మాయిని వేధించిన వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి కూడా చెప్పారు. కమిషనర్ తో తాను ఫోన్ లో మాట్లాడానని..ఇలాంటి ఘటనలు వైరల్ అయినప్పుడు కామన్ గానే ప్రజల దృష్టి వాటిపైకి వెళుతుందని ఆయన అన్నారు. అంతేకానీ అదేమీ పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదన్నట్టు మాట్లాడారు. చర్యలు తీసుకుంటామని చెప్పి ఊరుకుంటే అయిపోయేది..కానీ పరమేశ్వర అనవసరంగా నోరు పారేసుకున్నారు. ఇప్పుడు అదే ఆయన నెత్తి మీదకు వచ్చింది. అందరితో తిట్లు తినేలా చేసింది. 

 

today-latest-news-in-telugu | home-minister

 

Also Read: Trump Tariffs: ట్రంప్ సుంకాల దెబ్బకు పడిపోయిన చమురు ధరలు..కంగారులో రష్యా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు