Sexual harassment : ఏలూరు స్పోర్ట్స్ హాస్టల్లో దారుణం.. మహిళా వెయిట్ లిఫ్టర్లపై కోచ్ లైంగిక వేధింపులు

ఏపీలోని ఏలూరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్)లో శిక్షణ  పొందుతున్న మహిళ క్రీడాకారుల్ని కోచ్‌లు వేధింపులకు గురి చేస్తున్నారు. మీకు శిక్షణ ఇవ్వాలంటే మా కోరికలు తీర్చాలంటూ వేధిస్తున్నారు. ఈ వేధింపుల్ని తట్టుకోలేక వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు.

New Update
Sexual harassment

Sexual harassment

Sexual harassment : ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండి వారికాళ్లమీద వారు నిలబడాలని తల్లిదండ్రులు ఎంతకష్టమైన భరించి ఉన్నత చదువులు చదివిస్తున్నారు. మరోవైపు వారికి ఇష్టమైన రంగాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. కానీ, ఎక్కడైతే తాము నైపుణ్యాలను నేర్చుకుందామనుకుంటున్నారో అక్కడే వారికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. గురువు స్థాయిలో ఉండి శిక్షణ ఇవ్వాల్సిన వారు కామంధులుగా మారుతున్నారు. శిక్షణ కోసం వచ్చేవారిని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.

Also Read: హోటల్‌లో దంపతుల శృంగారం.. కిటికీలు వేసుకోవడం మర్చిపోవడంతో..?

ఏపీలోని ఏలూరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్)లో శిక్షణ  పొందుతున్న మహిళ క్రీడాకారుల్ని కోచ్‌లు వేధింపులకు గురి చేస్తున్నారు. మీకు శిక్షణ ఇవ్వాలంటే మా కోరికలు తీర్చాలంటూ వేధిస్తున్నారు. ఈ వేధింపుల్ని తట్టుకోలేక వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. ఏలూరులోని శాయ్ హాస్టళ్లో ఉంటూ మహిళా వెయిట్ లిఫ్టర్లు కొంతకాలంగా శిక్షణ పొందుతున్నారు.  కాగా వారికి శిక్షణ ఇస్తున్న వినాయక్‌ ప్రసాద్‌ అనే కోచ్‌ వారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదుల అందాయి. 

ఏలూరు శాయ్ హాస్టల్ ఇన్‌ చార్జ్ , అథ్లెటిక్స్ కోచ్ గా కూడా విధులు నిర్వహిస్తున్న వినాయక్ ప్రసాద్ కోచింగ్‌ తీసుకుంటున్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, వారిని లైంగికంగా వేధిస్తున్నాడని వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పై స్పందించిన అధికారులు ఒక కమిటీని వేశారు. బెంగళూరు నుంచి వచ్చిన ఓ విచారణ బృందం ఆరోపణలపై క్రీడాకారిణుల నుంచి వివరాలు సేకరించింది. ఈ విచారణలో కోచ్ వేధింపులు నిజమేనని తేలింది.

Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!

బెంగళూరు నుంచి వచ్చిన ఒక విచారణ బృందం నిన్న వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, ఇతర విభాగాల్లో శిక్షణ పొందుతూ వసతి పొందుతున్న బాలికలను విచారించారు. విచారణ అనంతరం లైంగిక వేదింపులు వాస్తవమేనని నిర్ధారించుకుని ఏలూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో పోలీసులు హాస్టల్ ఇన్‌చార్జ్‌, అథ్లెటిక్స్ కోచ్ ప్రసాద్‌పై సెక్షన్ 75 బీఎన్ఎస్ 8 ఆఫ్ పోక్సో యాక్ట్ క్రింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో ఆరోపణలు వాస్తవమని తేలితే కోచ్ పై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా శాయ్ హాస్టల్ ఇన్‌ చార్జ్‌ , జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ కోచ్ పై ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళా వెయిట్ లిఫ్టర్లు ఫిర్యాదు చేశారు. కాగా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు