Kabaddi: కబడ్డీ కోర్ట్లోనే కోచ్ అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సిద్దిపేట ఘటన!
కబడ్డీ కోచ్ సంపత్ అకాల మరణం హుస్నాబాద్ చౌటపల్లి గ్రామస్థులకు తీరని శోకం మిగిల్చింది. ఎంతోమంది కబడ్డీ ప్లేయర్లను తయారుచేసిన సంపత్ రోడ్డు ప్రమాదంలో మరణించగా గ్రామస్థులు వినూత్నంగా అంత్యక్రియలు జరిపించారు. కబడ్డీ కోర్టులోనే చితిపేర్చి దహన సంస్కారాలు చేశారు.