/rtv/media/media_files/2025/05/04/WEFyyYXgiHvJqsXfGWeR.jpg)
prakasham crime news
AP Crime: ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో జాతీయ రహదారి NH-16పై రోడ్డు ప్రమాదాలు ప్రాణాంతకంగా మారాయి. శనివారం తెల్లవారుజామున విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్తున్న ఈ రహదారిపై వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడగా, క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
భయానక దృశ్యాలు:
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదాలు ఎలా జరిగాయనే దానిపై పోలీసుల విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ప్రాథమికంగా అందుతున్న సమాచారం మేరకు.. వేగంగా ప్రయాణిస్తున్న వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడం, అధిక స్పీడ్ కారణంగా డ్రైవర్లు నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదాలు జరిగాయని అనుమానిస్తున్నారు.
ఇది కూడా చదవండి: రోజూ లీటర్ పాలు తాగితే ప్రమాదమా..నిపుణులు ఏం చెబుతున్నారు?
ప్రకాశం జిల్లా పోలీసు అధికారి ఎస్పీ ఏఆర్ దామోదర్ తన బృందంతో సహా సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రహదారిపై ట్రాఫిక్‌ను నియంత్రించి, సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, బాధితుల కుటుంబాలకు సమాచారం అందజేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘోర ఘటన నేపథ్యంలో స్థానిక ప్రజల్లో ఆందోళన వ్యక్తమైంది. రహదారి మీద ట్రాఫిక్ నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: పసుపుతో ఇలా చట్నీ చేశారంటే జలుబు, ఫ్లూ పరార్
(crime | crime news | latest-news | telugu-news | AP Crime | ap crime updates | ap-crime-news | ap-crime-report | ap crime latest updates)
Follow Us