Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. నాలుగు రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల ఈ నెల 24వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.