శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రేపే ఆర్జిత సేవా టికెట్లు విడుదల
వచ్చే ఏడాది 2025 మార్చి నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను రేపు ఉదయం 10 గంటలకు టీడీడీ విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అష్టదళపాద పద్మారాధన సేవల టికెట్లను విడుదల చేస్తోంది.
వచ్చే ఏడాది 2025 మార్చి నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను రేపు ఉదయం 10 గంటలకు టీడీడీ విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అష్టదళపాద పద్మారాధన సేవల టికెట్లను విడుదల చేస్తోంది.
వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ టీడీపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీషతో రమేష్ కనిపించారు. దీంతో పాటు ర్యాలీలో కూడా పాల్గొనడంతో పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది.
అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలకు గుర్తుగా త్వరలో అతని పేరుతో తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. నిన్న పొట్టి శ్రీరాముల వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడు వెళ్తుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో కోస్తాంధ్ర, రాయలసీమలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు.
వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ఏకాదశి దర్శనాలు జరగనుండటంతో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమయంలో ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. అలాగే కేవలం టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే ఉత్తర ద్వార దర్శనానికి అనుమతి ఇవనున్నట్లు తెలిపింది.
తెలంగాణలోని కొండగట్టు వెళ్లి వస్తుండగా కారు చెట్టును ఢీకొట్టి నలుగురు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన పల్నాడులో చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లాకి చెందిన వారు కొత్త కారు పూజ కోసం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
వైసీపీ నేత విజయ్ సాయి రెడ్డిపై టీడీపీ నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి ఫుల్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై శుక్రవారం చేసిన వాఖ్యలపై ఆనం స్పందించారు.
నెల్లూరు జిల్లాలో కలకలం సృష్టించిన ట్రాన్స్ జెండర్ హాసినీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హిజ్రా నాయకులు హాసిని, అలేఖ్యల మధ్య గొడవలే హత్యకు కారణమని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. హత్య కేసులో 15 మంది ప్రమేయం ఉందని అన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రతికూల పరిస్థితులతో తుపానుగా మారలేదు.శుక్రవారం ఉదయం వరకు తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.శుక్ర, శనివారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.