/rtv/media/media_files/2025/01/18/VMcfDtzdSUrviF9624br.jpg)
bus fire
Ap Bus Fire Accident: ఏపీలో ఘోర బస్సు ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి తిరువూరు వస్తున్న ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ప్రమాదం శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: Karnataka: మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్..భారీగా ఛార్జీలు పెంపు!
ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తిరుపతి నుంచి తిరువూరుకు AP 39UY 8484 ఆర్టీసీ బస్సు వస్తుంది. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం, మన్నేటికోట అడ్డరోడ్డు వద్ద కు రాగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Also Read: Laila Teaser: ఒక్కోడికి చీరలు కట్టి పంపిస్తా.. దుమ్ము లేపుతున్న టీజర్
బస్సులో పొగలు...
ఆ సమయంలో బస్సులో వారంతా కూడా గాఢ నిద్రలో ఉన్నారు.బస్సులో పొగలు రావడంతో కొందరు ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు పెట్టారు. దీంతో డ్రైవర్ వెంటనే బస్సును ఆపేశాడు.దీంతో ప్రయాణికులంతా కూడా బస్సు దిగిపోయారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పిందిజ
అయితే బస్సులోని విలువైన వస్తువులు.. లగేజీ పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. బస్ వెనుక లగేజీ ప్రాంతంలో మొదట మంటలు వచ్చినట్లు ప్రయాణికులు అంటున్నారు. బస్ లో విలువైన బంగారం.. మొబైల్స్ట్ ఇతర విలువైన వస్తువులు ఉన్నాయని ప్రయాణికులు అంటున్నారు. ప్రయాణికులను ప్రత్యామ్నాయ బస్సులు ద్వారా గమ్య స్థానాలకు తరలిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Also Read: Ap Govt: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. సీఐడీ మాజీ చీఫ్ సునీల్ విచారణకు ఆదేశాలు!
Also Read: Ceasefire: కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్