Kakani Govardhan Reddy: మాజీ మంత్రిపై కేసు నమోదు!

కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ నేత వంటేరు ప్రసన్న కుమార్ ఫిర్యాదు చేశారు. ఇటీవల కావలి ఆసుపత్రిలో పోలీసులు, టీడీపీ నేతలపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు.

New Update
AP: అందుకే ఇలా పిచ్చి రాతలు రాస్తున్నారు: మాజీ మంత్రి కాకాణి

Kakani Govardhan reddy

Kakani Govardhan Reddy: వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కావలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో అతనిపై కేసు నమోదు అయ్యింది. ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. టీడీపీ నేత వంటేరు ప్రసన్న కుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. సెక్షన్లు 224, 351/2, 352, 353/2 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇది కూడా చూడండి:OTT Movies: ఓటీటీలో మిలియన్ల జనం చూసిన సీరీస్ లు, సినిమాలు ఇవే.. మరి మీరు చూశారా?

అసలు గొడవ ఏంటంటే?

బోగోలు మండలం కోళ్లదిన్నెలో ఇటీవల టీడీపీ, వైసీపీల(TDP vs YCP) మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో ఇరు వర్గాల వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని కావలి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు. అక్కడ కూడా ఇరు వర్గాలు వారు మళ్లీ దాడి చేసుకున్నారు.

ఇది కూడా చూడండి:BREAKING: సినీ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్.. విస్తృతంగా తనిఖీలు!

ఆ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వైసీపీ నేతలను కాకాణి పరామర్శించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈసారి వచ్చేది వైసీపీ ప్రభుత్వం అని, పోలీసులు ఎక్కడ ఉన్నా కూడా వారి బట్టలు ఉడదీస్తామన్నారు. ఎలాగైనా టీడీపీ నేతలను వదలమని బహిరంగంగా శపధం చేశారు. దీంతోమ కాకాణిపై ప్రసన్న కుమార్(TDP Prasanna Kumar) పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చూడండి: Stock Market Today: లాభాల్లో  ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..రికార్డ్ స్థాయిలో బంగారం ధర

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు