Goreti venkanna: ఒక కమ్యూనిస్టు జీవిత చరిత్ర వంద రామాయణాలకు ధీటుగా ఉంటుంది: గోరటి వెంకన్న!

సమాజ శ్రేయస్సు కోసం కమ్యూనిస్టులు ఎన్నో పోరాటాలు చేశారని కవి గోరటి వెంకన్న అన్నారు. ఒక కమ్యూనిస్టు జీవిత చరిత్ర 100 రామాయణాలకు ధీటుగా ఉంటుందన్నారు. నిజం ఎక్కడుంటే కమ్యూనిజం అక్కడ ఉంటుందని నెల్లూరులో జరిగిన సీపీఎం 27వ రాష్ట్ర మహాసభలో చెప్పారు.  

New Update
goreti venkanna

Goreti venkanna

Goreti venkanna: సమాజ శ్రేయస్సు కోసం కమ్యూనిస్టు పార్టీ ఎన్నో పోరాటాలు చేసిందని ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న అన్నారు. దోపిడీ పాలకవర్గం తాత్కాలికమేనని, ప్రజల హక్కుల సాధనలో ఉద్యమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. సీపీఎం 27వ రాష్ట్ర మహాసభను పురస్కరించుకొని నెల్లూరులోని ముత్తుకూరు గేట్‌ సెంటర్‌లో 3 రోజులుగా జరుగుతున్న సింహపురి సాంస్కృతికోత్సవాలు ముగిశాయి. చివరి రోజు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి వచ్చిన గోరటి వెంకన్న.. సీపీఎం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎన్నో పోరాటాలకు సాంస్కృతి కార్యక్రమాలు ఆయువుపట్టుగా నిలిచాయన్నారు. కళాకారులు ప్రజలను చైతన్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు.

కమ్యూనిజం జీవించి ఉంటుంది..

జగతి ఉన్నంత వరకూ కమ్యూనిజం జీవించి ఉంటుంది. శ్రమ జీవుల వల్లనే దేశ సంపద పెరిగింది. కమ్యూనిస్టులు హింసావాదులు కాదు. హింసకు సమాధానంగా తమ నెత్తురుతో ప్రాణత్యాగాలకు పాల్పడిన మహాయోధులు. కమ్యూనిస్టులు నిరంకుశులు కాదు. అందుకు సమాధానం కార్మిక, వర్గ, ప్రజాస్వామ్యమే. పుచ్చలపల్లి సుందరయ్య, నంబూద్రిప్రపాద్‌, చండ్ర రాజేశ్వరరావు, సర్వదేవబట్ల రామనాధం,

ఇది కూడా చదవండి: live-in relationship: పెళ్లి కాకున్నా కలిసి జీవించాలంటే ఈ రూల్స్ పాటించాలి

ప్రమోద్‌దాస్‌ గుప్తా, జ్యోతిబసు, ఎకె గోపాలన్‌, భీమిరెడ్డి నరసింహారెడ్డి, నర్రా రాఘవరెడ్డి, మల్లు స్వరాజ్యం, జక్కా వెంకయ్య వీరంతా గొప్ప త్యాగధనులు. ఒక్కొక్కరి చరిత్ర రామాయణంలో రాముని కథవలే రామభక్తులు ఏ విధంగా పులకిస్తారో ఒక్కొక్క కమ్యూనిస్టు జీవిత చరిత్ర 100 రామాయణాలకు ధీటుగా ఉంటుంది. నిజం ఎక్కడుంటే కమ్యూనిజం అక్కడ ఉంటుంది' అని గోరటి వెంకన్న అన్నారు. 

ఇది కూడా చదవండి: Champions Trophy 2025: లాహోర్‌ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు.. అతిథుల లిస్ట్ ఇదే!

Advertisment
తాజా కథనాలు