ఏపీలోని కూటమి ప్రభుత్వంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు ఏకంగా 48 ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. పెన్షన్లు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో ఆ ఎమ్మెల్యేలు పాల్గొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వాళ్లందరికీ నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేల వివరణతో సంతృప్తి చెందకుంటే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
స్వయంగా తాను లబ్ధిదారులను కలిసి పింఛన్లు ఇస్తే ఎమ్మెల్యేలు ఎందుకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజాదర్బార్‌లో కూడా ఎమ్మెల్యేలు తప్పకుండా పాల్గొనల్సిందేనని తేల్చిచెప్పారు. నిత్యం ప్రజల్లోనే ఉండి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలన్నారు. దీనిపై ఎవరు నిర్లక్ష్యం చేసినా వాళ్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Follow Us