/rtv/media/media_files/2025/06/14/wdliqXh5yLqOc2I6f7Cu.jpg)
Crime
తిరుపతి జిల్లా సూళ్లురుపేట మండలం ఉగ్గుముడిలో దారుణం జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి సూసైడ్ చేసుకుంది. మృతులు వరలక్ష్మి(24), వర్షిత్ (4), ప్రశాంత్(2)గా గుర్తించారు. కుటంబ కలహాల వల్లే ఆమె ఈ దారుణానికి పాల్పడ్డట్లు ఉగ్గుముడి గ్రామస్థులు అనుమానిస్తున్నారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: 20 మందిని రేప్ చేసి, హత్యలు చేసిన ఖైదీకి జైల్లో సకల సౌకర్యాలు.. VIDEO
ఇదిలాఉండగా శనివారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. 2009 బ్యాచ్‌కు చెందిన శ్రీకాంత్.. ఫిల్మ్‌నగర్ పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్నాడు. తాజాగా ఇంట్లో ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. అక్టోబర్ 23 నుంచి అతడు విధులకు హాజరుకావడం లేదు. ఆర్థిక సమస్యల వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Also Read: ఇజ్రాయిల్, ఇండియా కలిసి పాక్‌పై దాడికి ప్లాన్.. ఇందిరాగాంధీ ఎంట్రీతో సీన్ రివర్స్
Follow Us