/rtv/media/media_files/2025/09/18/road-accident-2025-09-18-16-15-06.jpg)
Road Accident
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉయ్యూరు మండలం గండిగుంట సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ఈ దుర్ఘటనలో మొత్తం నలుగురు యువకులు మరణించారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడ సమీపంలోని కుందేరు గ్రామానికి చెందిన కొందరు యువకులు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పింది. వేగంగా వెళ్తున్న కారు జాతీయ రహదారిపై నుంచి పక్కనే ఉన్న సర్వీసు రోడ్డులోకి పల్టీలు కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు.
స్పాట్‌లోనే నలుగురు మృతి..
మరొక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు.. అటుగా వెళ్తున్న ప్రయాణికులు స్పందించి సహాయ చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే.. దురదృష్టవశాత్తూ చికిత్స పొందుతూ ఆ యువకుడు కూడా మృతి చెందాడు. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందిన యువకుల సంఖ్య నాలుగుకు చేరింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కారు పల్టీలు కొట్టిన తీరును, ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే.. అతివేగమే ఈ ప్రమాదానికి ముఖ్య కారణమని పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: నకిలీ నెయ్యి వివాదంలో కీలక పరిణామం..అది నకిలీదేనని తేల్చిన సీబీఐ
జాతీయ రహదారులపై వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు తప్పనిసరిగా వేగ పరిమితిని పాటించాలని పోలీసులు మరోసారి సూచించారు. మృతి చెందిన యువకుల మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుందేరు గ్రామానికి చెందిన యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి: ఏలూరులో దారుణం..అత్త కుటుంబంపై అల్లుడి దాడి..స్పాట్‌లో..
ఇది కూడా చదవండి: భార్యను చంపిన భర్త...దృశ్యం సినిమా స్పూర్తితో మాస్టర్ ప్లాన్
Follow Us