AP Crime : ఏలూరులో దారుణం..అత్త కుటుంబంపై అల్లుడి దాడి..స్పాట్‌లో..

ఏలూరు జిల్లా గొల్లలకోడేరులో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో రామచంద్రరావు తన మేనమామ కృష్ణతో కలిసి భార్య శ్రీలక్ష్మి, మామ సత్యనారాయణ, బావమరిది రాజేష్ లపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
Atrocity in Eluru..son-in-law attacks aunt's family..

Atrocity in Eluru..son-in-law attacks aunt's family..

 AP Crime : ఏలూరు జిల్లా పాలకోడేరు(మం) గొల్లలకోడేరులో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపధ్యంలో విరవల్లి రామచంద్రరావు తన మేనమావ మట్టపర్తీ కృష్ణతో కలిసి భార్య శ్రీలక్ష్మి, మామ సత్యనారాయణ, బావమరిది రాజేష్ లపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో  శ్రీలక్ష్మి, సత్యనారాయణ,రాజేష్ తీవ్రంగా గాయపడ్డారు.

భార్యను,మామను చాకుతో రామచంద్రరావు పొడిచాడు. ఈ క్రమంలో  చాకు విరిగిపోవడంతో పక్కనే వున్న కత్తితో రామచంద్రరావు దాడి చేశాడు. కాగా గాయపడిన శ్రీలక్ష్మి,సత్యనారాయణలను భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.రాజేష్ కు అరచేయి తెగిపోవడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు.  ఆయన పరిస్థితి విషమంగా ఉంది.  దీంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.


కాగా దాడి చేసిన శ్రీలక్ష్మి భర్త రామచంద్రరావు పరారీ కాగా, రామచంద్రరావుకు సహకరించిన మేనమామ కృష్ణ అత్తిలి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. సత్యనారాయణ కూతురు శ్రీలక్ష్మితో రామచంద్రరావుకు వివాహమైంది. కుటుంబ కలహాలతో శ్రీలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది.గత కొంతకాలంగా కుటుంబ కలహాల నేపధ్యంలో శ్రీలక్ష్మి గొల్లలకోడేరులోని పుట్టింటి వద్దే ఉంటుంది.

Advertisment
తాజా కథనాలు