/rtv/media/media_files/2025/11/10/husband-kills-wife-2025-11-10-15-43-34.jpg)
Husband kills wife...master plan inspired by Drishyam movie
Husband kills wife: కొన్ని సినిమాలు ప్రేక్షకుల మీద వీపరీతమైన ప్రభావం చూపుతాయి. అయితే అది మంచికైతే పర్వాలేదు. కానీ, కొంతమంది మాత్రం సినిమా దృశ్యాలను తమకు అనుకూలంగా మార్చుకుని నేరాలకు పాల్పడుతున్నారు.అజయ్ దేవ్‌గణ్ నటించిన దృశ్యం సినిమాను స్ఫూర్తిగా తీసుకుని ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఆ చిత్రాన్ని నాలుగుసార్లు చూసిన సదరు వ్యక్తి భార్య హత్య కేసునుంచి తప్పించుకోవటానికి పెద్ద మాస్టర్ ప్లానే వేశాడు. కానీ, చివరకు అది బెడసికొట్టి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
దృశ్యం సినిమా చూసిన ఓ వ్యక్తిని దాన్ని తన భార్య హత్యకు ఉపయోగించుకున్నాడు. అంతేకాదు, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు సినిమాను మరిపించేలా యాక్టింగ్ చేశాడు. తన భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని ప్రచారం కూడా చేశాడు. చివరకు ఓవర్ యాక్టింగ్ భయటపడటంతో అడ్డంగా పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పుణెకు చెందిన సమీర్ జాదవ్ ,అంజలికి 2017లో పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సమీర్ ఓ గ్యారేజ్ నిర్వహిస్తుండగా అంజలి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది.
ఇదిలా ఉండగాభార్యాభర్తలిద్దరూ పిల్లలతో కలిసి పుణెలోని శివానే ప్రాంతంలో ఉంటున్నారు. అక్టోబర్ 26 న సమీర్ తన భార్యను కొత్తగా అద్దెకు తీసుకున్న వేర్ హౌస్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని మాయం చేయడం కోసం ఇనుప డబ్బాలో వేసి కాల్చి బూడిద చేశాడు. బూడిదను నదిలో పారపోశాడు. అంత సవ్యంగా సాగిందనుకుని మర్డర్ కేసును తప్పుదోవ పట్టించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆమెకు వేరే వ్యక్తితో ఎఫైర్ ఉందని నమ్మించేందుకు ప్రయత్నించాడు. అందులో భాగంగా అంజలి ఫోన్‌నుంచి ఆమె స్నేహితుడు ఒకరికి ‘ఐ లవ్ యూ’ అని మెసేజ్ పెట్టాడు. అతడితో కొద్దిసేపు చాటింగ్ , చేశాడు. అనంతరం భార్య కనిపించటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సమీర్ ఫిర్యాదులో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలెట్టారు. అయితే తన భార్య కేసు ఏం చేశారంటూ తరచుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బాధపడుతున్నట్లు ఓవర్ యాక్టింగ్ చేయడం మొదలు పెట్టాడు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో ట్రీట్‌మెంట్ ఇచ్చారు. దీంతో జరిగిందంతా బయటపెట్టాడు. మరోవైపు నిందితుడి సీసీ టీవీ ఫుటేజ్ ను కూడా సేకరించగా వేర్ హౌస్‌కు భార్యతో వెళ్లిన సమీర్ తిరిగి ఒంటరిగా వచ్చిన దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులు మొదట అంజలికి వేరే వ్యక్తితో ఎఫైర్ ఉండి ఉంటుందని, అందుకే అనుమానంతో సమీర్ ఆమెను చంపేసి ఉంటాడని అనుకున్నారు. కానీ, సమీరే మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. అయితే ఈ కథనం అంతా నడిపించడానికి అజయ్ దేవ్‌గణ్ నటించిన దృశ్యం సినిమాను నాలుగు సార్లు చూశానని విచారణలో సమీర్ ఒప్పుకోవడం కొసమెరుపు.
Follow Us