YS Sharmila: ముంబై నటి కేసులో జగన్ హస్తం? షర్మిల సంచలన ఆరోపణలు!
ముంబై నటి కాదంబరి జెత్వానీ ఇష్యూలో మాజీ సీఎం జగన్ ప్రమేయం ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. జెత్వానీ నోరు మూయించడానికి సజ్జన్ జిందాల్, జగన్ ప్లాన్ చేశారని ఆరోపించారు. ఇద్దరు కూతుళ్లున్న జగన్ ఆమె విషయం ఎందుకు ఆలోచించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.