YS Sharmila: జగన్‌ సర్కార్‌పై సీబీఐ విచారణ.. షర్మిల సంచలన డిమాండ్

AP: తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని షర్మిల మండిపడ్డారు. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల నూనెలు వాడారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యల చేశారని.. దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

New Update
YS Sharmila: నన్ను ఓడించేందుకు కుట్ర.. సీఎం జగన్‌పై షర్మిల విమర్శల దాడి

YS Sharmila: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలపై టీడీపీ, వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాలపై ఏపీ కాంగ్రెసు చీఫ్ షర్మిల ఘాటుగా స్పందించారు. ఆమె ఎక్స్‌లో విమర్శలు గుప్పించారు. తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భగం కలిగించేలా ఉన్నాయని అన్నారు. 

కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే.. సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశ్యమే మీకు లేకుంటే.. నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే… తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. లేదా CBI తో విచారణ జరిపించాలని అన్నారు. మహా పాపానికి,ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చాలని అన్నారు. మీ వ్యాఖ్యలపై కట్టుబడి ఉండాలని, నిజాలు నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని పేర్కొన్నారు.

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు…

తిరుపతి లడ్డూలో జంతు కళేబరం ఆయిల్ కలిపారంటూ ఏసీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో తిరుమల వెంకటేశ్వరుని పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు చేశారు. బుధవారం ఎన్డీఏ కూటమి సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల నుంచి తీసిన ఆయిల్ వాడారని అన్నారు. ఈ విషయం తెలియగానే తాను తీవ్ర ఆందోళనకు గురయ్యానని చెప్పారు. అయితే ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నామని, ప్రజలకు స్వచ్ఛమైన భోజనం, ప్రసాదం అందించడమే తమ లక్ష్యమన్నారు.

నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్..

‘తిరుపతి ప్రసాదం, భోజనంలో నాసిరకమైన సరుకులు వాడారు. నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ కూడా వాడారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని తెప్పించి లడ్డూ ప్రసాదం కోసం వాడుతున్నాం’ అని సీఎం చెప్పారు. ఇదిలా ఉంటే.. వరదల కారణంగా రూ. 350 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందని తెలిపారు. ఇదొక చరిత్రగా పేర్కొన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఒప్పుకుంటే ఎన్డీఏ ఎమ్మెల్యేలు అందరం ఒక నెల జీతం సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇద్దామని ఈ సందర్భంగా కోరారు.

Advertisment
తాజా కథనాలు