లడ్డూ కల్తీ ఆరోపణలపై జగన్ సంచలన నిర్ణయం.. 28న అన్ని ఆలయాల్లో.. చంద్రబాబు నాయుడు తిరుమల, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశాడని ఫైర్ అయ్యారు జగన్. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28న పూజల్లో పాల్గొనాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. By Nikhil 25 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి తిరుపతి లడ్డూ కల్తీ అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న వేళ వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన చేశారు. తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని ఆసత్య ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు తిరుమల, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశాడని ఫైర్ అయ్యారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28న పూజల్లో పాల్గొనాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరుమల పవిత్రతను,స్వామివారి ప్రసాదం విశిష్టతను,వెంకటేశ్వరస్వామి వైభవాన్ని,టీటీడీ పేరు ప్రఖ్యాతులను,వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య… — YS Jagan Mohan Reddy (@ysjagan) September 25, 2024 ఏపీలో తిరుమల లడ్డూ కల్తీ అంశం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. నాటి వైసీపీ పాలకుల కారణంగానే లడ్డూ కల్తీ జరిగిందని కూటమి సర్కార్ ఆరోపిస్తోంది. ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని సైతం నిర్వహింది. ఈ ఘటనపై విచారణకు సిట్ ను సైతం ఏర్పాటు చేసింది చంద్రబాబు సర్కార్. అయితే.. ఇదంతా చంద్రబాబు కుట్ర అని వైసీపీ ఆరోపిస్తోంది. రాజకీయాల కోసం జరగని దాన్ని జరిగినట్లుగా చంద్రబాబు అబద్ధలు చెబుతున్నాడంటూ వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలోనూ తిరుమల లడ్డూ అంశంపై యుద్ధమే జరుగుతోంది. #Tirupati Laddu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి