AP : పులివెందులలో దారుణం.. సొంత తమ్ముడినే

కడప జిల్లా పులివెందులలో దారుణం చోటు చేసుకుంది. సొంత అన్న తన తమ్ముడ్ని చంపేశాడు. పులివెందుల మండలం రాయలపురం కు చెందిన బాబా ఫక్రుద్దీన్ ను తన అన్న సమ్మెటతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

New Update
kadapa

AP : నేటి సమాజంలో రోజురోజుకు దారుణాలు ఎక్కువై పోతున్నాయి. ఓ వైపు ఆడ పిల్లలపై అత్యాచారాలు, మరోవైపు కుటుంబ కలహాలు.. సొంతవాళ్లే ఒకరినొకరు చంపుకోవడం, భార్యను భర్త హత మార్చడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. తాజాగా కడప జిల్లా పులివెందులలో ఇలాంటి దారుణమే ఒకటి చోటు చేసుకుంది.

సొంత అన్న తన తమ్ముడ్ని చంపేశాడు. పులివెందుల మండలం రాయలపురం చెందిన బాబా ఫక్రుద్దీన్ ను తన అన్న సమ్మెటతో కొట్టడంతో బాబా ఫక్రుద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. అయితే ఈ గొడవకు గల కారణాలు, అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు