శ్రీకాళహస్తి హైడ్రా కూల్చివేతలు | Hydra Demolished Illegal Constructions In Srikalahasti | RTV
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యక్షమైన అఘోరీ తాజాగా శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకుంది. ఆలయంలోకి అనుమతించకపోవడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని.. కావాలంటే గన్ తో చంపేయండని ఫైర్ అయింది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చామన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి. లబ్ధిదారులకు సామాజిక భద్రతా పించన్లు రూ.4000 పంపిణీ చేశామన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీలను నెరవేరుస్తుందని కామెంట్స్ చేశారు.
శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మార్కు పాలన ప్రారంభమైంది. రాజీవ్ నగర్ కాలనీలో అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించారు. రోడ్డుపై భూములను ఆక్రమించుకుని గృహాలు నిర్వహించుకున్న వాటిని రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీసు శాఖ సిబ్బంది తొలగిస్తున్నారు.
AP: శ్రీకాళహస్తిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్నిర్మించిన వైసీపీ నవరత్నాలు గుడిని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దాడి చేసి పరారైయ్యారు. పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. గుడికి దగ్గరలోని సీసీపుటేజ్ పరిశీలిస్తున్నారు.