/rtv/media/media_files/2025/07/11/nellore-suicide-2025-07-11-16-39-20.jpg)
నెల్లూరు జిల్లా కోవూరులో టీడీపీ సీనియర్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం రేపుతోంది. ఇమామ్ భాషా అనే కార్యకర్త పార్టీ మీటింగ్ మధ్యలోనే పురుగుల మందు తాగాడు. వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించాడు ఇమామ్ భాషా. మొదటి నుంచి ఉన్న తమకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఫైర్ అయ్యారు. ముదివర్తి గ్రామంలో ఇద్దరు మైనార్టీ నేతల మధ్య వర్గపోరు సాగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇమామ్ భాషా ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. అయితే.. స్పందించిన తోటి కార్యకర్తలు ఇమామ్ భాషాను హాస్పిటల్‌కు తరలించారు. స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆస్పత్రికి వెళ్లి భాషాను పరామర్శించారు. ట్రీట్‌మెంట్‌కు అయ్యే పూర్తి ఖర్చు భరిస్తానని హామీ ఇచ్చారు.
స్పందించిన నేతలు..
మైనార్టీ నేత ఇమామ్ బాషా ఆత్మహత్యాయత్నంపై టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రియాక్ట్ అయ్యారు. పార్టీలో చిన్న చిన్న విబేధాలు రావడం సహజమన్నారు. ఎమ్మెల్యే ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఇమామ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడన్నారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. కార్యకర్తలకు అన్యాయం చేయనని.. గతంలో ఇమామ్ భాషాకు హార్ట్ ఆపరేషన్ కూడా తామే చేయించామని ప్రశాంతిరెడ్డి అన్నారు.