/rtv/media/media_files/2025/04/29/d2i19YT6ovlYpwYkzmVJ.jpg)
IPS Anjaneyulu Group 1 Case: అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేసులో సీనియర్ IPS అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయనకు ఏపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. APPSC 2018లో నిర్వహించిన గ్రూప్ 1 ఎగ్జామ్‌లో అవకతవకలు జరిగినట్లు కేసు నమోదైంది. ఆ సమయంలో ఆయన APPSC కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. గతకొద్ది రోజుల క్రితమే ఆయన నటి కాదంబరీ జెత్వానీ, ఆమె తల్లిదండ్రులను అక్రమంగా నిర్బంధించిన కేసులో అరెస్ట్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం హయంలో జరిగిన ఆ గ్రూప్ 1మెయిన్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ మూల్యాంకన వ్యవహారంలో అవకతవకలు, నిధుల దుర్వినియోగం చోటుచేసుకున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ బాధ్యతలు రహస్యంగా ఉంచి.. ఓ సీనియర్ అధికారికి అప్పగించినట్లు తెలిసింది. దీనికోసం ఏర్పాటైన ప్రత్యేక బృందాలు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాయి. ప్రాథమిక విచారణ పూర్తైన తర్వాత ACBకి బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి.
Also Read: హర్యానాలో ఐస్ క్రీంలు అమ్ముకుంటున్న పాక్ ఎంపీ.. ఆయన కన్నీటి కథ ఇదే!
Senior IPS officer PSR Anjaneyulu files two quash petitions in AP #HighCourt, alleging political vendetta. Cases based on complaints by ex-MP RRR and actress Kadambari Jethwani. Hearing adjourned to May 1@NewIndianXpress https://t.co/jZHdTeTuJm
— TNIE Andhra Pradesh (@xpressandhra) April 29, 2025
పి.సీతారామాంజనేయులుపై కేసు..
ఏపీపీఎస్సీ నుంచి అందిన రిపోర్ట్‌తో కేసు నమోదు చేసి విచారణ జరపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ డీజీపీని ఆదేశించారు. ఈ మేరకు పి.సీతారామాంజనేయులుపై విజయవాడలోని సూర్యారావుపేట పోలీసుస్టేషన్‌లో తాజాగా కేసు నమోదైంది. మోసం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, సాక్ష్యాల తారుమారు, నేరపూరిత కుట్ర, ఇతర సెక్షన్ల కింద కేసు పెట్టారు. 2018లో గ్రూప్-1 జవాబు పత్రాలు ఎన్ని సార్లు వాల్యుయేషన్ జరిగింది, ఎవరికి లబ్ధి చేకూరింది, ఈ కుట్రలో ఎవరున్నారని తేల్చే పనిలో అధికారులు ఉన్నారు. ఎంత పెద్దమొత్తంలో ముడుపులు చేతులు మారాయన్నది విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉంది. డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేసి.. వచ్చిన మార్కులనే నార్మల్‌గా వాల్యుయేషన్ చేసినట్లు చూపించారని సంబంధిత వర్గాలు అనుమానిస్తున్నాయి. అలాగే హాయ్‌లాండ్ రిసార్టులో వాల్యుయేషన్ ఏర్పాట్ల బాధ్యతలు పొందిన కామ్‌సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఆంజనేయులుకు ఉన్న సంబంధమేంటో కూడా బహిర్గతం కానుంది.
Also read: Pahalgam terror attack: ఉగ్రదాడిపై కొత్త అనుమానం రేపిన UP సీఎం యోగి
2018 డిసెంబరు 31న 169 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీస్ అయ్యింది. తర్వాత ఆంద్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చింది. 2019 మే 26న ప్రిలిమ్స్ నిర్వహించి, నవంబరు 1న ఫలితాలు విడుదల చేసింది. అర్హత సాధించిన 9,679 మందికిగాను 6,807 మంది 2020 డిసెంబరులో మెయిన్స్ రాశారు. కొవిడ్ కారణంగా డిజిటల్ విధానంలో చేసిన మూల్యాంకన రిజల్ట్స్ 2021 ఏప్రిల్ 28న APPSC విడుదల చేసింది. డిజిటల్ మూల్యాంకనం గురించి నోటిఫికేషన్‌లో పేర్కొనలేదని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఫలితాల వెల్లడిపై స్టే విధించింది.
Also read: Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్.. కర్మణ్యేవాధికారస్తే అంటూ.. !
సంప్రదాయ విధానంలోనే మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. దీంతో అవే మార్కులను చేతితో ముల్యాంకనం చేశామని చెప్పి మళ్లీ వెల్లడించారని ఆరోపణలు వస్తున్నాయి. అనంతరం ఫైనల్ రిజల్ట్స్ వెల్లడించి.. ఇంటర్వూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసింది. 2024 మార్చిలో హైకోర్టు మెయిన్స్ పరీక్షను రద్దు చేసి.. మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. ఈ కేసు పూర్తిగా విచారణ అయితే 2018నోటిఫికేషన్‌లో అక్రమాలు బయటపడితే ఆ నోటిఫికేషన్, లేదా మెయిన్స్ రద్దైయ్యే అవకాశం ఉంది.
Also Read: పాక్ జర్నలిస్టులకు షాక్ ఇచ్చిన భారత్.. కేంద్రం సంచలన నిర్ణయం
(appsc-group-1 | appsc-dl-recruitment | IPS Anjaneyulu | andhrapradesh | group-1 | latest-telugu-news)