/rtv/media/media_files/2025/04/29/Ijde85Rqsy9LLAor4QkN.jpg)
Pak Journalists Accounts Ban
పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్ మీడియా సంస్థల తరఫున పనిచేస్తున్న కొందరు పాకిస్థాన్ జర్నలిస్ట్‌ల ట్విట్టర్ ఖాతాలను బ్యాన్ చేసింది. ఐఎస్ఐ, పాకిస్థాన్ ప్రభుత్వంతో కలిసి ఇండియాపై తప్పుడు ప్రచారం చేస్తున్న జర్నలిస్ట్‌ల ఖాతాలను హోల్డ్‌లో పెట్టిన స్క్రీన్ షార్ట్‌లు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఇది కూడా చూడండి: Russia: రష్యా సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటన
#BREAKING
— Rishabh Goel (@RishGoel) April 29, 2025
India has banned @X accounts of various #Pakistani Journalists affiliated with the #Pakistan ISPR and ISI for spreading #FakeNews and Disinformation.
Some of these journalists are still being employed by Indian Media orgs.#PakistanBehindPahalgam #fakenews #Pakistan pic.twitter.com/MCJ3adLAdV
ఇది కూడా చూడండి:Waqf Board Assets: వక్ఫ్ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. కేంద్రం కీలక ప్రకటన
ఇటీవల యూట్యూబ్ ఛానెల్స్‌పై..
ఇదిలా ఉండగా కేంద్రం ఇటీవల ఓ కీలక నిర్ణయం కూడా తీసుకుంది. పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానళ్లను కేంద్రం నిషేధించింది. డాన్, జియో న్యూస్, సామా టీవీ వంటి మొత్తం 16 ఛానళ్లపై వేటు వేసింది. చివరకు మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఛానల్‌లో కూడా ప్రసారాలు ఏం లేవు. జాతీయ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యూట్యూబ్ ఛానళ్లను నిషేధించింది.
ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!
భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన కంటెంట్, తప్పుదోవ పట్టించే కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే యూట్యూబ్ ఛానళ్లను నిషేధించినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన ఎక్స్ ఖాతాను భారత్‌లో నిలిపివేసిన సంగతి తెలిసిందే.