/rtv/media/media_files/2025/04/29/Mdx7hcl4uWUTe0W2CywB.jpg)
పలు వివాదాల్లో చిక్కుకున్న తెలంగాణ సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్మాల్ మరో సంచలన ట్వీట్ చేశారు. ఇప్పటికే ఆమె ట్వీట్లు పలు వివాదాలకు దారి తీశాయి. కంచ గచ్చిబౌలి భూవివాదంలో ఆమె ఏఐ ఫోటో రిట్వీట్ చేసిందని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ వివాదం అలా ఉండగానే ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌పై వేటు పడింది. ప్రస్తుతం ఆమె పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆమె మిస్ వరల్డ్ పోటీలకు సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం పాత స్థానానికి బదిలీ చేసింది. స్మితా సబర్వాల్‌ను ఆర్థిక సంఘం(ఫైనాన్స్ కమిషన్) సభ్య కార్యదర్శిగా నియమించింది. స్మితా పైన తీసుకున్న నిర్ణయం వెనుక అనేక ఆసక్తి కర అంశాలు చర్చలోకి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ఆమె సర్కారుకు వ్యతిరేకంగా పోస్టు చేయడం వివాదాస్పదంగా మారింది. ఆ వ్యవహారంలో వివరణ ఇవ్వాలంటూ గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు.
Also read: పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్.. ఇటుగా విమానం ఎగిరితే పేల్చపడేస్తాం!
"Karmanye vadhikaraste, ma phaleshu kadachana"#IAS
— Smita Sabharwal (@SmitaSabharwal) April 29, 2025
Spent 4 months in Tourism.
Did my best!
1.Brought in the long pending Tourism Policy 25-30, a first for the State. Will create a solid frame for direction & investment in neglected tourist circuits.
2. Revamped the working… pic.twitter.com/2nUlVQO4W3
మంగళవారం ఆమె పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా చివరిరోజు.. దీంతో ఆమె ఎక్స్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. "కర్మణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచన" అని ట్వీట్ చేసింది. దీని అర్థం.. నువ్వు కర్మ చేయడానికి మాత్రమేగానీ, ఆ కర్మఫలానికి అధికారివి కాదు; ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు ; అలాగని కర్మలు చేయడం మానకు. మిస్ వరల్డ్ పోటీలకు ఈసారి హైదరాబాద్ ఆతీధ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఇన్ని రోజులుగా స్మితా సబర్వాల్ ఈ బాధ్యతను భుజాలపై వేసుకున్నారు. తీరా పోటీలకు మరో వారం రోజులు మాత్రమే ఉందనగా ఆమెను ఆ శాఖ నుంచి తప్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ ట్విట్ చేసినట్లు తెలుస్తోంది. ఫలితాన్ని ఆశించి ఏ పని చేవద్దు. విధి నిర్వహణలో ఏ స్వలాభం కోసం ఆమె పని చేయలేదని స్మిత సబర్వాల్ చెప్పకనే చెప్పారు.
Also read: వామ్మో భారత్‌తో పెట్టుకోం.. పాకిస్తాన్ నుంచి టర్కీ ఫ్లైట్ పరుగో పరుగు..!
దీంతోపాటు ఆమె టూరిజం డిపార్ట్‌మెంట్‌లో ఆమె అనుభాన్ని కూడా పంచుకుంది. టూరిజంలో 4 నెలలు గడిపాను. నా వంతు కృషి చేశానని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు. అలాగే ఆమె టూరిజం డిపార్ట్‌మెంట్‌లో చేసిన పనులను చెప్పుకొచ్చింది.
(smita sabharwal ias controversy | ias-smita-sabharwal | ias officer smita sabharwal | telangana | HUC lands | ias-transfers)