/rtv/media/media_files/2025/04/29/TprzooJmXLIJdQ3OjBeb.jpg)
Daba Ram
పహల్గాం ఉగ్రదాడి ప్రభావంతో భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. వీసా మీద వచ్చిన వారంతా కూడా పాక్‌కి వెళ్లిపోవాలని తెలిపింది. అయితే వీసాతో వచ్చి ఇండియాలో నివసిస్తున్న పాక్ పౌరులు చాలా మంది ఉన్నారు. అందులో పాకిస్థాన్ మాజీ హిందూ ఎంపీ దాబా రామ్ ఫ్యామిలీ కూడా ఒకరు. వీరి ఫ్యామిలీ హర్యానాలోని ఫతేహాబాద్‌లో నివసిస్తోంది. పాక్ నుంచి ఇండియాకు వచ్చి ఇక్కడే పౌరసత్వం పొంది.. కుల్ఫీలు, ఐస్ క్రీంలు అమ్ముకుంటూ.. కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పాక్ ఎంపీ అయిన దాబా రామ్ ఇండియాకు ఎందుకు వచ్చారు? ఇయన కన్నీటి కథ ఏంటో చూద్దాం.
ఇది కూడా చూడండి: Russia: రష్యా సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటన
మతం మార్చుకోమని ఒత్తిడి చేయడంతో..
దాబా రామ్ 1947 విభజనకు ఒక రెండు ఏళ్ల కిందట పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో జన్మించాడు. తన కుటుంబం అలాగే పాకిస్థాన్‌లో ఉండిపోయింది. అయితే ఈ సమయంలో మతం మార్చుకోవాలని కొందరు ఒత్తిడి చేశారట. కానీ దాబా రామ్ అసలు తన మతాన్ని మార్చుకోలేదు. తన మతంలోనే పాకిస్థాన్‌లో ఉండిపోయారు. అయితే1988లో పాకిస్తాన్‌లో జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లోని లోహియా, బఖర్ జిల్లా నుంచి దాబా రామ్ ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే దాబా రామ్ ఎంపీగా ఎన్నికైన తర్వాత కూడా తన సమస్యలు తగ్గలేదు.
ఇది కూడా చూడండి:Waqf Board Assets: వక్ఫ్ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. కేంద్రం కీలక ప్రకటన
దాబా రామ్‌ది ఉమ్మడి కుటుంబం కావడంతో రోజురోజుకీ సమస్యలు పెరుగుతూనే వచ్చాయి. వారి కుటుంబంలో ఉంటున్న ఓ బంధువు కుమార్తెను కొందరు దుండగులు కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేశారు. ఈ విషయంపై దాబా రామ్ కోర్టుకు వెళ్లినా కూడా న్యాయం జరగలేదు. దీంతో బాధపడి.. పాకిస్థాన్ విడిచి పెట్టి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. 13 మంది కుటుంబ సభ్యులతో 2000 సంవత్సరంలో వచ్చి ఫతేహాబాద్‌లోని రతన్‌గఢ్ గ్రామంలో ఉంటున్నారు. అయితే దాబా రామ్ తన కుటుంబ సభ్యులతో పాటు 35 మంది బంధువులను కూడా ఇండియాకు తీసుకొచ్చారు.
ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!
దాబా పిల్లలు కూడా హిందూ పద్ధతిలోనే వివాహం చేసుకున్నారు. మళ్లీ పాక్ వెళ్లడానికి దాబా రామ్‌కి ఇష్టం లేకపోతే ఇండియాలోనే ఉండిపోయాడు. దీంతో ఇక్కడ రాజకీయ నాయకులు భారత్ పౌరసత్వం ఇవ్వడానికి సాయపడ్డారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటరు కార్డులను కూడా ఇచ్చారు. పాకిస్తాన్‌లో ఉన్నప్పుడు తన పేరు దేశ్‌రాజ్. కానీ ఓటరు కార్డులు చేయడానికి వచ్చిన అధికారులు తన పేరును బలవంతంగా దాబా రామ్‌గా మార్చారని తెలిపారు.
తన పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే తన కల నెరవేరుతుందని దాబా రామ్ అన్నారు.దాబా రామ్ కుటుంబంలో ప్రస్తుతం 34 మంది సభ్యులు ఉన్నారు. అయితే వీరిలో 28 మందికి భారత పౌరసత్వం లేదు. దీని కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. గత 25 ఏళ్ల నుంచి పౌరసత్వం కోసం అప్లై చేసుకుంటున్నారు. దాబా రామ్ మొదట్లో ఇండియాకి కేవలం ఒక నెల వీసాతో వచ్చాడు. అలా ఆ వీసాని పొడిగిస్తూ.. భారత పౌరసత్వం సంపాదించుకున్నారు.