Amaravathi: నేటినుంచి అమరావతి రెండోదశ భూ సమీకరణ ప్రారంభం..

ఏపీ రాజధాని అమరావతిలో రెండోదశ భూ సమీకరణ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. రెండో దశలో 20, 494 ఎకరాలకు రైతుల నుంచి సమీకరించాలి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు నుంచే ఈ ల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది.

New Update
Second Phase of Land Pooling for Capital Amaravati to Commence today

Second Phase of Land Pooling for Capital Amaravati to Commence today

ఏపీ రాజధాని అమరావతిలో రెండోదశ భూ సమీకరణ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. రెండో దశలో 20, 494 ఎకరాలకు రైతుల నుంచి సమీకరించాలి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు నుంచే ఈ ల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే భూ సమీకరణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రమంలోనే నేటి నుంచి రెండో దశ భూసమీకరణకు సంబంధించి  ప్రక్రియ ప్రారంభం కానుంది. కానీ భూసమీకరణ విషయంలో ప్రభుత్వం ప్లాన్ మార్చినట్లు కనిపిస్తోంది. ఇకనుంచి ఏ ప్రాజెక్టుకు ఆ ప్రాజెక్టు సంబంధించి కావాల్సిన భూ సమీకరణ చేయాని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  

Also Read: కాంగ్రెస్తో బీజేపీ పొత్తు.. మహారాష్ట్ర పాలిటిక్స్లో బిగ్ ట్విస్ట్.. అసలేమైందంటే?

సీఎం చంద్రబాబు CRDA మీటింగ్‌లో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒకేసారి వేలాది ఎకరాలను భూములను తీసుకుంటే ప్రభుత్వంపై విమర్శలు వస్తాయి. అందుకే ఏ ప్రాజెక్టుకు సంబంధించి ఆ ప్రాజెక్టుకు కావాల్సిన భూమిని తీసుకోవాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. మరోవైపు రాజధాని నిర్మాణం కోసం ఇంకా భూమి అవసరమవుతుందని నిపణులు భావిస్తున్నారు. 

మొదటి దశలో చూసుకుంటే దీనికి సంబంధించిన భూ కేటాయింపులు కూడా జరిగాయి. రెండోదశలో స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్, అంతర్జాతీయ విమానాశ్రయాలకు భూ సమీకరణ చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా పల్నాడు జిల్లా, అమరావతి, గుంటూరు జల్లా తుళ్లూరు పరిధిలో 7 గ్రామాల నుంచి భూసమీకరణ జరగనుంది. గతేడాది నవంబర్ 27 జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఏడు గ్రామాల్లో భూ సమీకరణ చేపట్టే అధికారాన్ని ప్రభుత్వం CRDA కమిషనర్‌కు అప్పగించింది.  

Also Read: భూ కుంభకోణంలో ఐదుగురు ప్రభుత్వం ఉద్యోగులు సస్పెండ్

తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం చూసుకుంటే  16,562.56 ఎకరాల పట్టా భూమి, 104.01 ఎకరాలు అసైండ్ భూమి మొత్తం 16,666.57 ఎకరాలు సేకరించనున్నారు. ఇక ప్రభుత్వ భూమి 3828.56 ఎకరాలు తీసుకోనున్నారు. తుళ్లూరు మండలంలో చూసుకుంటే పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రాపురం గ్రామాల్లో భూసమీకరణ చేయనున్నారు. ఇక అమరావతి మండలంలోని వైకుంఠపురం, యండ్రాయి, పెదమద్దూరు, కర్లపూడి లేమల్లెలో భూసమీకరణ చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో మొత్తం 29 గ్రామాల పరిధిలో దాదాపు 34,400 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు.

Advertisment
తాజా కథనాలు