Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతి!
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గైట్ కాలేజీకి చెందిన ప్రవీణ్, కార్తీక్ అనే విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. వెనుక నుండి వచ్చిన బొగ్గు లారీ బలంగా ఢీకొని వారిద్దరిపై ఎక్కి రోడ్ పై కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దాంతో విద్యార్థుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.