BREAKING: ఇకపై అక్కడ కూడా ఇసుక ఫ్రీ.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

AP: పట్టా భూములతో పాటు డీకేటీ పట్టా భూముల్లోనూ ఇసుక తవ్వకాలకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మేరకు పట్టా, డీకేటీ భూముల్లో ఇసుక తవ్వకాలకు గనులశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.కె.మీనా నిబంధనలను జారీ చేశారు.

New Update
Chandrababu on Vijayawada floods

Free Sand: సీఎం చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. డీకేటీ పట్టా భూముల్లోనూ ఇసుక తవ్వకాలకు అనుమతించేందుకు నిర్ణయం తీసుకున్నారు. పట్టా, డీకేటీ భూముల్లో ఇసుక తవ్వకాలకు నిబంధనలను గనులశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.కె.మీనా జారీ చేశారు.

దసరా నుంచే...

ఏపీలో ఇల్లు కట్టుకునే వారికి దసరా పండుగ సమీపిస్తున్న క్రమంలో చంద్రబాబు సర్కార్ తీపి కబురు అందించింది. ప్రస్తుతం ఇసుక కోసం ఇక్కట్లు పడుతున్న వారికి కాస్త ఊరటనిచ్చే వార్తను చెప్పింది. ఈ నెల 15 నుంచి ఇసుక రీచ్‌లలో పూర్తి స్థాయిలో ఇసుక అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. అక్టోబర్ 15 నుంచి ఏపీలో ఇసుక కొరత ఉండదని అన్నారు. 15 నుంచి అందరికి ఇసుక అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. వానాకాలంలో వస్తున్న వరదలను దృష్టిలో ఉంచుకొని గతంలో  నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇసుక రీచ్‌లలో తవ్వకూడదని ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకే రీచ్‌లలో ఇసుక తవ్వకాలను నిలిపివేసినట్లు ఆయన వివరణ ఇచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు