Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

New Update
detgd

AP News : విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తికోసం తన కుమారుడిని కుటుంబ సభ్యులే హతమార్చిన కేసును గుండెపోటుగా పేర్కొంటూ తప్పుదారి పట్టించారంటూ ఓ మహిళ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆదివారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో రాష్ట్రప్రజలు చంద్రబాబుకు వినతులు ఇస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.  

ముఖంపై యాసిడ్‌ పోసి చంపి..

ఇందులో భాగంగానే ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన విజయారాణి.. కాంతిరాణా, విశాల్‌గున్నీలపై ఫిర్యాదు చేసింది. ‘నా కొడుకు పేరుపై రూ.50 కోట్ల ఆస్తి ఉంది. అది కొట్టేయాలనే ఉద్దేశంతో నా భర్త రెండో భార్య కుమారుడు నా కుమారుని ముఖంపై యాసిడ్‌ పోసి చంపేశారు. కానీ కాంతిరాణా, డీసీపీ విశాల్‌ గున్నీ గుండెపోటుతో చనిపోయాడని కేసును పక్కదారి పట్టించారు. 19 నెలలుగా న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నా. మాకు న్యాయం చేయండి’ అంటూ చంద్రబాబును కోరారు. దీంతో కేసు విచారించి న్యాయం చేస్తానని బాధితురాలికి సీఎం హామీ ఇచ్చారు. 

Also Read :  ఆర్టీసీలో త్వరలో 3 వేల ఉద్యోగాలు.. పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన

Advertisment
Advertisment
తాజా కథనాలు