ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ కుంభకోణం

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ కుంభకోణం జరిగింది. గతంలో మేనేజర్‌గా పనిచేసిన నరేశ్, గోల్డ్ అప్రైజర్‌గా హరీశ్ ఫిక్సిడ్ డిపాజిట్లు, బంగారం రుణాల నుంచి కోట్ల నగదు అకౌంట్లలో బదిలీ చేసుకున్న ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.

author-image
By Kusuma
New Update
ICICI Bank : వాటి పై వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ బ్యాంకు!

పల్నాడు జిల్లాలో ఓ బ్యాంక్‌లో భారీ కుంభకోణం ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిలకలూరిపేటలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ కుంభకోణం జరిగింది. గతంలో నరేశ్ మేనేజర్‌గా, గోల్డ్ అప్రైజర్‌గా హరీశ్ పనిచేశారు. ఇలా పనిచేస్తున్న సమయంలో ఇద్దరూ కలిసి రూ.కోట్ల రూపాయిల నగదును ఖాతాదారుల అకౌంట్ల నుంచి డబ్బులు లాక్కున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. చిలకలూరిపేటకి చెందిన పొత్తూరి కోటేశ్వరమ్మ ఈ బ్రాంచ్‌లో రూ.45 లక్షలు డిపాజిట్ చేశారు.

ఇది కూడా చూడండి: ఈరోజు ముద్దపప్పు బతుకమ్మ.. ఎలా పూజిస్తారంటే?

రెన్యూవల్ చేస్తానని చెప్పి..

ఏడాది అయిన తర్వాత మళ్లీ రెన్యూవల్ చేస్తున్నానని ఆమెకు చెప్పి ఆ డబ్బును తన ఖాతాకు బదిలీ చేసుకున్నారు. ఇలా మరికొందరికి చెందిన రూ.79 లక్షలను తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. అయితే ఖాతాదారులకు అనుమానం రాకుండా ప్రతి నెల వడ్డీ కూడా బ్యాంకు నుంచి వేశారు. రూ.లక్ష రుపాయలకు వెయ్యి చొప్పున అకౌంట్లలో వేశారు. ఈ డబ్బులు ఇటీవల ఆగిపోవడంతో సందేహం వచ్చి బ్యాంకు దగ్గరు వెళ్లి అడగ్గా ఈ విషయం బయట పడింది. ఎందరో ఖాతాదారుల సొమ్మును బదిలీ చేశారని తెలియగా.. వారు బ్యాంకు వద్ద ఆందోళన చేశారు. అయితే ఈ కుంభకోణంలో గోల్డ్ అప్రైజర్ హరీశ్ కూడా ఉన్నాడని ఆరోపిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Lebanan: నస్రల్లా వారసుడి లక్ష్యంగా బీరూట్‌ పై దాడి!

ఎక్కువగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బంగారం తాకట్టు చేసిన రుణాల్లో మోసం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఐసీఐసీఐ బ్యాంక్‌ విజయవాడ జోనల్‌ మేనేజర్‌ సందీప్‌ మెహ్రా, రీజినల్‌ మేనేజర్‌ రమేశ్‌ ఖాతాదారుల నుంచి వివరాలు సేకరించారు. మొత్తం 14 మంది ఖాతాదారుల నుంచి రూ.6.90 కోట్ల నగదు, 115 సవర్ల బంగారం కుంభకోణం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. షేక్‌ బాజిబీ అనే మహిళ పేరు మీద ఎక్కువ మొత్తంలో డిపాజిట్లు, బంగారం రుణాలు ఉండటంతో ఆమె ఖాతాల్లోంచి నగదు భారీగా బదిలీ చేసుకున్నారు. 

ఇది కూడా చూడండి: Italy: టేకాఫ్‌ అవుతుండగా విమానంలో మంటలు...!

Advertisment
Advertisment
తాజా కథనాలు