/rtv/media/media_files/u2ZkGYIyN2QWzLuevtc1.jpg)
Balineni Szrinivasa Reddy : మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య ఈ రోజు జనసేనలో చేరారు. వారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజానీకానికి ఒక దశా దిశ పవన్ కళ్యాణ్ మాత్రమేనన్నారు. పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు. ఐదేళ్లలో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారన్నారు. జనసేన పార్టీ తనకు ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదన్నారు. పార్టీ ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా పని చేస్తానన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత హిందువులు అందరిపై ఉందన్నారు.
త్వరలో గుంటూరు నుంచి చేరికలు
త్వరలో గుంటూరు నియోజకవర్గం నుంచి పార్టీలోకి మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. కేంద్రమంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే ధూళిపాళ్లతో కలిసి పని చేస్తానన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నారు.
Also Read : మూడు సూపర్ కంప్యూటర్లను ఆవిష్కరించిన ప్రధాని..