ఈ నెల 10న ఏపీ కేబినెట్ భేటీ AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మరోసారి రాష్ట్ర మంత్రి వర్గం భేటీ కానుంది. ఈ నెల 10న కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తిరుపతి లడ్డూ వివాదం, ఎన్నికల ఇచ్చిన హామీల అమలు వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. By V.J Reddy 02 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి AP Cabinet Meet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మరోసారి రాష్ట్ర మంత్రి వర్గం భేటీ కానుంది. ఈ నెల 10న కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తిరుపతి లడ్డూ వివాదం, ఎన్నికల ఇచ్చిన హామీల అమలు వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే పెన్షన్ పెంపు, మహిళలకు ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు, ఉచిత ఇసుక, చెత్త పన్ను రద్దు వంటి పలు కీలక హామీలను అమలు చేసిన కూటమి సర్కార్.. ఈ నెల 10న జరిగే మంత్రివర్గం సమావేశంలో మరిన్ని పథకాలకు శ్రీకారం చుటనున్నట్లు సమాచారం. ఈ నెల 10వ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ..#AndhraPradesh #CabinetMeeting #RTV pic.twitter.com/OaUWBQuXVi — RTV (@RTVnewsnetwork) October 2, 2024 ఇకపై అక్కడ కూడా ఇసుక ఫ్రీ.. సీఎం చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. డీకేటీ పట్టా భూముల్లోనూ ఇసుక తవ్వకాలకు అనుమతించేందుకు నిర్ణయం తీసుకున్నారు. పట్టా, డీకేటీ భూముల్లో ఇసుక తవ్వకాలకు నిబంధనలను గనులశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.కె.మీనా జారీ చేశారు. దసరా నుంచే... ఏపీలో ఇల్లు కట్టుకునే వారికి దసరా పండుగ సమీపిస్తున్న క్రమంలో చంద్రబాబు సర్కార్ తీపి కబురు అందించింది. ప్రస్తుతం ఇసుక కోసం ఇక్కట్లు పడుతున్న వారికి కాస్త ఊరటనిచ్చే వార్తను చెప్పింది. ఈ నెల 15 నుంచి ఇసుక రీచ్‌లలో పూర్తి స్థాయిలో ఇసుక అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. అక్టోబర్ 15 నుంచి ఏపీలో ఇసుక కొరత ఉండదని అన్నారు. 15 నుంచి అందరికి ఇసుక అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. వానాకాలంలో వస్తున్న వరదలను దృష్టిలో ఉంచుకొని గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇసుక రీచ్‌లలో తవ్వకూడదని ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకే రీచ్‌లలో ఇసుక తవ్వకాలను నిలిపివేసినట్లు ఆయన వివరణ ఇచ్చారు. ప్రతిపక్షాలు నుంచి ఒత్తిడి... ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలోన్ చంద్రబాబు సర్కార్ విఫలమైందంటూ ప్రతిపక్షాలు విమర్శల దాడికి దిగాయి. ఎన్నికల సమయంలో ఎలాగైనా గెలవాలని చెప్పి చంద్రబాబుబ్ తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు అంటేనే మోసాలను కేర్ ఆఫ్ అడ్రెస్ అని నిప్పులు చెరిగారు. మరోవైపు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కూడా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. కేంద్రంలో కీలకంగా వ్యవహరించే స్థానంలో ఉన్న చంద్రబాబు ఇంకా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఎందుకు తీసుకొని రాలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి