Odela 2 Collections: “ఓదెల 2” ఫస్ట్ డే కలెక్షన్స్ తుస్.. విజువల్స్ ఎక్కువ విషయం తక్కువ..!

తమన్నా నటించిన 'ఓదెల 2' విడుదలైన తొలి రోజే బాక్సాఫీస్ వద్ద తక్కువ కలెక్షన్లతో నిరాశపరిచింది. కథలో కొత్తదనం, గ్రిప్ లేకపోవడం, కారణంగా వసూళ్లు తగ్గాయని చెప్పొచ్చు. అయితే, ఈ సినిమా మొత్తం సుమారు రూ.25 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కించారు.

New Update
Odela 2 Collections

Odela 2 Collections

Odela 2 Collections: తమన్నా(Tamannaah) ప్రధాన పాత్రలో నటించిన మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ "ఓదెల 2" ఈ నెల 17వ తేదీ (గురువారం) థియేటర్లలో విడుదలైంది. అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పలు అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. అయితే విడుదలైన మొదటి రోజే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, "ఓదెల 2" ఫస్ట్ డే నెట్ కలెక్షన్ రూ.85 లక్షలు మాత్రమే. , గురువారం పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో సినిమా సగటు ఆక్యుపెన్సీ 15.65%గా నమోదైంది. ఉదయం షోలలో 15.82%, మధ్యాహ్నం 16.79%, సాయంత్రం 14.06%, రాత్రి షోలలో 15.93% ఆక్యుపెన్సీ కనిపించింది.

Also Read:ఫ్యాన్స్‌ మీట్‌లో షాకింగ్ డెసిషన్ బయటపెట్టిన సూర్య..

తమన్నాకి సెట్ కాలేదు..

మూవీ ఫస్ట్ హాఫ్‌లోని మొదటి 20 నిమిషాలు ఆసక్తికరంగా సాగినా, తర్వాత కథ నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయినట్లు టాక్. తమన్నాకి ఈ సినిమా సెట్ కాలేదు అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కథలో కొత్తదనం కొరత, స్క్రీన్‌ప్లే లో గ్రిప్ లేకపోవడం, VFX పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వకపోవడం వంటి అంశాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.

Also Read:అరేయ్ ఏంట్రా ఇది.. సడన్‌గా చూసి నిజం అనుకున్నాం కదరా బాబు..

మరోవైపు కళ్యాణ్ రామ్ నటించిన "అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి" సినిమా పోటీకు ఉంది. "ఒదెల 2"పై దాని ప్రభావం పడే అవకాశముంది.

తాజా సమాచారం ప్రకారం, "ఒదెల 2" శాటిలైట్, డిజిటల్ హక్కులు మంచి ధరకు విక్రయమైనట్టు టాక్. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే మేకర్స్ డీల్స్ ఫైనల్ చేసినట్టు సమాచారం. అయితే నిర్మాతలు ఈ సినిమాపై సుమారు రూ.25 కోట్లు ఖర్చు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ బడ్జెట్ రికవరీ కావాలంటే, సినిమా సగం మేరకైనా వసూళ్లు సాధించాల్సిన అవసరం ఉంది.

Also Read:xAI గ్రోక్‌కి చాట్‌జీపీటీ తరహా మెమరీ ఫీచర్‌.. ఎలా పనిచేస్తుందంటే..?

Advertisment
తాజా కథనాలు