/rtv/media/media_files/2025/04/20/o70Lc8urdvL20gqo2w9p.jpg)
Haryana Young woman Murder attempt on fiance
Crime: హర్యానాలో మరో దారుణం జరిగింది. రెండు రోజుల్లో పెళ్లి పీఠలు ఎక్కాల్సిన యువకుడు ఆస్పత్రి బెడ్ ఎక్కాడు. ఎంగేజ్‌మెంట్ ఘనంగా చేసుకున్న యువతి.. పెళ్లికి ముందు కాబోయేవాడికి ఊహించని షాక్ ఇచ్చింది. ప్రియుడితో కలిసి దారుణంగా కొట్టింది. ప్రస్తుతం అతను కోమాలో చావుబతుకులమధ్య కొట్టుమిట్టాడుతుండగా ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కర్రలు, బేస్ బాల్ బ్యాట్‌లతో..
ఈ మేరకు ఫరీదాబాద్‌కు చెందిన 28 ఏళ్ల ITI టీచర్ గౌరవ్‌కు నేహాతో ఇటీవల నిశ్చితార్థం అయింది. అయితే అంతకుముందే మరో యువకుడు సౌరవ్ తో ప్రేమలో ఉన్న నేహా.. గౌరవ్ అడ్డు తగిలించుకోవాలనుకుంది. ఇందులో భాగంగానే ఏప్రిల్ 17 అతడిపై ప్రియుడితోకలిసి దాడి చేసింది. సౌరవ్ తన ఫ్రెండ్ సోనూ ఇద్దరు కలిసి గౌరవ్ పై దాడి చేశారు. కర్రలు, బేస్ బాల్ బ్యాట్‌లతో కాళ్లు, చేయి విరగొట్టారు. ముక్కుపై గాయపరిచారు. తలకు బలమైన గాయం కావడంతో గౌరవ్ కోమాలోకి వెళ్లిపోగా ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
Also Read: TS: తెలంగాణ యువతకు జపాన్ లో ఉద్యోగాలు..సీఎం రేవంత్ ఒప్పందాలు
ఇక గౌరవ్ మామ సునీల్ ఇష్యూ గురించి వివరిస్తూ.. గౌరవ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తన ప్రియుడితో కలిసి ప్లాన్ ప్రకారం దాడి చేయించింది. ప్రస్తుతం అతను కోమాలో ఉన్నాడు. ఏప్రిల్ 15న జరిగిన ఎంగేజ్మెంట్‌లో నేహా కుటుంబం గౌరవ్‌కి బంగారు ఉంగరం, గొలుసు ఇచ్చింది. దాడి సమయంలో అవి తీసుకున్నారు. గతంలోనూ సౌరవ్ బెదిరింపులకు పాల్పడ్డట్లు గౌరవ్ తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ ఘటపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: 'రాబిన్ హుడ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
murder | haryana | teacher | telugu-news | today telugu news