/rtv/media/media_files/2025/04/20/uhlnWMUWYi7TuSvbPM6Y.jpg)
MP Bjp Mla Usha Thakur
BJP MLA Controversy: బీజేపీ ఎమ్మెల్యే ఉషా ఠాకూర్ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. తాజాగా మరోసారి ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బీజేపీ గురించి, ఓటర్ల గురించి మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మద్యం, డబ్బు, బహుమతులు వంటి ప్రలోభాలకు లొంగి ఓట్లను అమ్మకునే వారంతా వచ్చే జన్మలో జంతువులుగా పుడతారని వ్యాఖ్యానించారు. పైగా తానూ రోజూ దేవుడితో మాట్లాడతానని..బీజేపీకి ఓటు వేయకపోతే కుక్కలు, పందులు, పిల్లులు, గొర్రెలు, ఒంటెలు, మేకలు పుడతారని కామెంట్స్ చేశారు.
Also Read: TS: తెలంగాణ యువతకు జపాన్ లో ఉద్యోగాలు..సీఎం రేవంత్ ఒప్పందాలు
బీజేపీ భజన..ఓటర్లపై అనుచిత వ్యాఖ్యలు..
మధ్యప్రదేశ్ లో మోవ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని హసల్ పూర్ గ్రామంలో ఏప్రిల్ 16వ తేదీన జరిగిన ఓ కార్యక్రమానికి.. బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఉషా ఠాకూర్ హాజరయ్యారు. అక్కడ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. బీజేపీ గురించి ఎమ్మెల్యే ఉషా చెప్పాలనుకున్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల గురించి వివరించారు. వాటి ద్వారా ప్రజల ఖాతాల్లోకి వేల రూపాయలు వెళుతున్నాయని చెప్పారు. రాష్ట్ర, దేశాభివృద్ధి కోసం బీజేపీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోందని చెప్పుకొచ్చారు. అందుకే బీజేపీకే ఓటు వేయాలని సూచించారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ అక్కడితో ఆగిపోకుండా...ప్రజలు మద్యం, డబ్బులు వంటి ప్రలోభాలకు లొంగిపోయి వేరే పార్టీలకు ఓట్లు వేస్తున్నారని ఉషా ఆరోపించారు. ప్రజంలతా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని.. అందుకోసం బీజేపీకి మాత్రమే ఓటు వేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ క్రమంలో అలా ప్రలోభాలకు లొంగేవారు, బీజేపీకి ఓటు వేయనివారు జంతువులుగా పుడతారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read: Hydra: TDP ఎమ్మెల్యేకు హైడ్రా షాక్.. 20 ఎకరాల్లో నిర్మాణాల కూల్చివేత
If you don't vote for the BJP, you will become Dogs, cats, camels and goats in the next life : BJP MLA Usha Thakur 🤣
— Roshan Rai (@RoshanKrRaii) April 19, 2025
pic.twitter.com/Z03H8NFvxe
today-latest-news-in-telugu | Madhya Pradesh | bjp-mla | voters
Also Read: Woman Elopes: 43ఏళ్ల వయసులో ఇదేం పని ఛీఛీ.. వీయ్యంకుడితో లేచిపోయిన మహిళ
Also Read: TS: తెలంగాణ యువతకు జపాన్ లో ఉద్యోగాలు..సీఎం రేవంత్ ఒప్పందాలు